Yamuna: యమున ఏజ్ ఎంతో తెల్సా..? ఆమె పిల్లలు ఏం చేస్తున్నారంటే..?
తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు చూరగొంది ప్రముఖ నటి యమున. కర్ణాటకలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబంలో జన్మించిన ఆమె 50కు పైగా సినిమాల్లో నటించింది. అలానే విధి, అన్వేషిత వంటి ధారావాహికలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే మధ్యలో ఒక్కసారిగా ఆమె కెరీర్‌కు బ్రేక్ పడింది...

సినిమాలు, సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చిర పరిచితమమైన నటి యమున. ‘మౌన పోరాటం’ చిత్రం తర్వాత ఈమె స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. అందం, అభినయం ఉండటంతో ఆమెకు తిరుగు లేకుండా పోయింది. ఫ్యామిలీ హీరోయిన్ అనే పేరు సంపాదించుకుని తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో సుమారు 50కు పైగా మంచి సినిమాలు చేసింది. విధి, అన్వేషిత వంటి సీరియల్స్ ఆమె వల్లే రన్ అయ్యాయి. అయితే 2011లో బెంగళూరులోని ఓ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ ఆమె పట్టుబడిందన్న వార్త ప్రకంపనలు రేపింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆమె కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయ్యింది. అయితే ఈ కేసులో యమున తప్పేమీ లేదంటూ.. కావాలనే ఆమెను ఇరికించారంటూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఆ సమయంలో యమునా చాలా డిప్రెషన్‌లోకి వెళ్లింది. సూసైడ్ ఆలోచనల వరకు వెళ్లి.. ఓ ఫ్రెండ్ ధైర్యం నూరిపోయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ఆ తర్వాత తన జీవితంపై ఫోకస్ పెట్టి.. కుటుంబం సపోర్ట్‌తో ముందుకు సాగింది. ఆ తర్వాత సీరియల్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి మంచి పాత్రలు చేస్తూ ముందుకు సాగుతోంది.
అయితే ఏజ్ పెరుగుతున్నా యమున అందం కొంచెం కూడా చెక్కు చెదరలేదు. ఇంతకీ ఆమె ఏజ్ ఎంతో తెల్సా..?. 52 సంవత్సరాలు. నమ్మడానికి కాస్త టైం పడుతుందిలేండి. తాను యంగ్‌గా ఉండటానికి కారణం.. మానసిక ప్రశాంతతే అని చెబుతుంది యమున. రోజు అరగంట వ్యాయామం, గంట మెడిటేషన్ తప్పనిసరిగా చేస్తానని చెబుతోంది. ఇక ఫుడ్ విషయంలోనూ చాలా నియమాలు పాటిస్తారట. కింద కూర్చూనే అన్నం తింటారట. సాయంత్రం ఆరున్నర వరకు డిన్నర్ తినేస్తారట. నిద్ర విషయంలో కూడా 8 గంటలు పడుకుంటారట. ఏదైనా మనం స్ట్రస్ ఫ్రీగా, శాంతంగా ఉంటే.. ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండవచ్చని ఆమె చెబుతున్నారు. కాగా యమునకు ఇద్దరు కూతుర్లు. పెద్దమ్మాయి ఐటీ ఫీల్డ్‌లో జాబ్ చేస్తున్నారు. రెండవ అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్. మీరు కూడా హెల్తీ అండ్ యంగ్‌గా ఉండాలంటే యమున ఇచ్చిన టిప్స్ ఫాలో అవ్వండి.
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి



