Rajamouli-Mahesh: రాజమౌళి-మహేశ్ మూవీ అప్డేట్.. హైదరాబాద్ గచ్చిబౌలిలో షూటింగ్ సెట్
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఎస్ ఎస్ ఎంబీ 29' సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ, స్క్రిప్ట్ ఫైనల్ అయిందని, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ, స్క్రిప్ట్ ఫైనల్ అయిందని, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
1000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టులో టాలీవుడ్ దిగ్గజాలతో పాటు హాలీవుడ్ స్టార్స్ నటించనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో రాజమౌళికి ఇష్టమైన చిత్రీకరణ లొకేషన్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇప్పటికే సెట్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
లొకేషన్ లో సెట్ వర్క్ మొదలైందని, మే నెలాఖరుకు పూర్తవుతుందని తెలుస్తోంది. జూన్ లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. దాదాపు రెండేళ్ల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా చిత్రీకరణ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విడుదల కానున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే మొదటిసారి మహేశ్ బాబు రాజమౌళితో సినిమా చేస్తుండటంతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు రేపుతున్నాయి. అయితే రాజమౌళి సినిమా ప్రకటన చేయగానే మహేశ్ మూవీలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇటీవల గుంటూరుకారం మూవీ విడుదల కాగా.. ఓటీటీ లో ఊహించని రెస్పాన్స్ వస్తోంది. పాకిస్థాన్ నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ మూవీ ట్రెండింగ్ ఉండటం గమనార్హం.
I just met GOD!!! ❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/NYsNgbS8Fw
— rajamouli ss (@ssrajamouli) January 14, 2023
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి


