Green Ganesha: ఈ హీరోయిన్‌లో ఇంత మంచి ట్యాలెంట్ కూడా ఉందా.? పసుపు, పిండితో గణేషుణ్ని ఎంత బాగా చేసిందో చూడండి..
Green Ganesha: ఒక్కొక్కరి ఒక్కో రకమైన ట్యాలెంట్ ఉంటుంది. ఒక వృత్తిలో కొనసాగుతున్నా తమ తమ అభిరుచులు, ఆలోచనల మేరకు ప్రవృత్తులను సైతం ఏర్పర్చుకుంటారు. ఇలా తమ హాబీలను ప్రపంచానికి చాటి..
Green Ganesha: ఒక్కొక్కరి ఒక్కో రకమైన ట్యాలెంట్ ఉంటుంది. ఒక వృత్తిలో కొనసాగుతున్నా తమ తమ అభిరుచులు, ఆలోచనల మేరకు ప్రవృత్తులను సైతం ఏర్పర్చుకుంటారు. ఇలా తమ హాబీలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇటీవల చాలా మంది సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. ఓవైపు తమ వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు తమ ట్యాలెంట్‌ను ప్రపంచానికి చాటుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్, వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు కూడా తన ట్యాలెంట్‌తో నెటిజన్లను మెస్మరైజ్ చేసింది.
వినాయక చవితి సందర్భంగా పిండి, పసుపుతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసింది. తయారీ విధానాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందుకోసం వితికా ముందుగా పిండి, పసుపును నీటితో కలిపి పిండిలా తయారు చేసింది అనంతరం దాంతో బుజ్జి గణేషున్ని తయారు చేసి. సహజ సిద్ధమైన రంగులు వేసి సింహాసనంపై అధిష్టించింది. అంతేకాదండోయ్.. ఈ ఏడాది పర్యావరణ హిత గణేషుడినే ప్రతిష్టించండి అంటూ వినాయక తయారీ విధానాన్ని పోస్ట్ చేసింది.
View this post on Instagram
వితిక షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోతో మంచి మెసేజ్ ఇచ్చారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వితికా తయారు చేసిన వినాయక విగ్రహం అచ్చంగా మార్కె్ట్లో లభించే విగ్రహంలాగే ఉండడం విశేషం. మరెందుకు ఆలస్యం మీరు కూడా వితికా చెప్పిన విధంగా గ్రీన్ గణేషుణ్ని తయారు చేసి ఈసారి వేడుకలను పర్యావరణ హితంగా మార్చేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..