Oscars 2023: ఆస్కార్‌ వేడుకకు హోస్ట్‌గా రానని తేల్చి చెప్పిన క్రిస్ రాక్..! కారణం ఏంటంటే..?

ఆ తర్వాత ఉత్తమ నటుడి అవార్డు తీసుకునేందుకు మరోమారు స్టేజ్‌ ఎక్కిన విల్ స్మిత్‌ మాట్లాడుతూ..భావోద్వేగానికి గురయ్యాడు..స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్రిస్‌ పట్ల తాను వ్యవహరించిన తీరుకు

Oscars 2023: ఆస్కార్‌ వేడుకకు హోస్ట్‌గా రానని తేల్చి చెప్పిన  క్రిస్ రాక్..! కారణం ఏంటంటే..?
Chris Rock
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Aug 30, 2022 | 8:18 PM

Chris Rock: 2023లో జరగబోయే ఆస్కార్ అవార్డు వేడుకల్లో హోస్ట్ గా చేసేందుకు వచ్చిన ప్రతిపాదనను తిరస్కరించాడు హాలీవుడ్‌ ప్రముఖ హాస్య నటుడు క్రిస్ రాక్.. 2022 మార్చిలో జరిగిన ఆస్కార్‌ అవార్డ్ వేడుకలో నటుడు విల్ స్మిత్, క్రిస్ రాక్ ను వేదికపైనే చెంపదెబ్బ కొట్టాడు. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే తాజాగా అరిజోనాలోని ఫీనిక్స్‌లోని అరిజోనా ఫైనాన్షియల్ థియేటర్‌లో జరిగిన ఓ ఈవెంట్ లో క్రిస్ ఆస్కార్‌కు తిరిగి వెళ్లడాన్ని నేరం జరిగిన ప్రదేశానికి తిరిగి వెళ్లడంగా అభివర్ణించారు. చెంపదెబ్బ ఘటన తర్వాత సూపర్ బౌల్ యాడ్‌లో కనిపించడానికి కూడా తాను నిరాకరించానని క్రిస్ రాక్ చెప్పాడు.

ఆస్కార్స్‌ 2022లో జరిగిన 94వ అవార్డుల ప్రదానం సందర్భంగా.. నటుడు విల్‌ స్మిత్‌, స్టేజ్‌పై మాట్లాడుతున్న సమయంలో నే అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ చెంప చెల్లుమనిపించాడు. బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ కాటగిరీలో అవార్డు ఇవ్వడానికి స్టేజ్‌ ఎక్కిన క్రిస్‌.. ఏదో మాట్లాడుతూ విల్‌ స్మిత్‌ భార్య, నటి జాడా పింకెట్‌ స్మిత్‌ గుండు తల మీద జోక్‌ వేస్తూ అవహేళనగా మాట్లాడాడు.. అనారోగ్యం కారణంగా గుండు చేయించుకున్న జాడా పింకెట్‌ స్మిత్‌ పై కామెంట్ చేసేసరికి స్మిత్‌ చూస్తూ ఉండలేక పోయాడు.. అప్పటివరకూ మామూలుగా ఉన్న వ్యక్తి కాస్తా సడెన్ గా కోపంతో రగిలిపోయాడు. వెంటనే స్టేజ్‌ మీదకు సీరియస్‌గా నడ్చుకుంటూ వెళ్లి క్రిస్‌ చెప్ప చెల్లుమనిపించాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఉత్తమ నటుడి అవార్డు తీసుకునేందుకు మరోమారు స్టేజ్‌ ఎక్కిన విల్ స్మిత్‌ మాట్లాడుతూ..భావోద్వేగానికి గురయ్యాడు..స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్రిస్‌ పట్ల తాను వ్యవహరించిన తీరుకు క్షమాపణలు కూడా చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి