Viral Video: ఈ పోలీస్ పాట వింటే మైమ‌రిచిపోతారు! వైరలవుతున్న వీడియో చూస్తే ఫిదా అవుతారు..

అప్పుడప్పుడు కొందరు తమలోని టాలెంట్‌ని కూడా సోషల్‌ మీడియాలో చూపిస్తుంటారు. తాజాగా ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాడుతున్న ఓ పాటకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Viral Video: ఈ పోలీస్ పాట వింటే మైమ‌రిచిపోతారు! వైరలవుతున్న వీడియో చూస్తే ఫిదా అవుతారు..
Police
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 29, 2022 | 9:42 PM

Viral Video: సోషల్ మీడియాలో (Social media) రకరకాల వీడియోలు వైరల్ (viral videos) అవుతుంటాయి. వీటిలో కొన్ని షాకింగ్‌గా ఉంటే, మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటాయి. ఇక.. జంతువుల ఫన్నీ కంటెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెటిజన్లు వెరైటీ వీడియోలను చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అప్పుడప్పుడు కొందరు తమలోని టాలెంట్‌ని కూడా సోషల్‌ మీడియాలో చూపిస్తుంటారు. తాజాగా ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాడుతున్న ఓ పాటకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. కోక్ స్టూడియో సీజ‌న్ 14 ట్రాక్ సాంగ్‌ అద్భుతంగా ఉంది.. అలీ సేథీ, షే గిల్ పాడిన అందమైన పాకిస్తానీ పాట సంగీత ప్రియులందరినీ క‌ట్టిప‌డేస్తున్న‌ది. ఆ పాట సంగీతం, మనోహరమైన సాహిత్యం వ‌ర‌ల్డ్ వైడ్‌గా అనేక మంది హృదయాలను కొల్లగొట్టింది. ఎంతో మంది కళాకారులు ఈ పాట‌ను పాడుతూ, డ్యాన్స్ చేస్తూ సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. కాగా, పుణె పోలీస్ సాగ‌ర్ గోర్‌ప‌డే ఈ పాటను పాడి ఆక‌ట్టుకున్నాడు. ఈ వీడియోను సాగ‌ర్ గోర్‌ప‌డే త‌న ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. పోలీస్ యూనిఫాంలో సాగ‌ర్..ప‌సూరీ పాట‌ను ఆల‌పించారు. ఓ స్టూడియోలో ఆయ‌న ఈ పాట పాడారు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. సాగ‌ర్ పాట విని నెటిజ‌న్లు మైమ‌రిచిపోయారు. ల‌వ్ ఎమోజీల‌తో ముంచెత్తారు. ఆయన పాట విన్న నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి