Viral Video: ప్రతి ఒక్కరూ ప్రేమలో పడే జాతి..! ఈ కుక్కలను పెంచుకున్న వారికే వాటి లక్షణాలు తెలుసు..

గోల్డెన్ రిట్రీవర్... అందుకే ఇవి కోట్లాది జంతు ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టాయి. వాటిలో అంత ప్రత్యేకత ఏముందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

Viral Video: ప్రతి ఒక్కరూ ప్రేమలో పడే జాతి..! ఈ కుక్కలను పెంచుకున్న వారికే వాటి లక్షణాలు తెలుసు..
Golden Retriever
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 29, 2022 | 7:53 PM

Golden Retriever dogs: గోల్డెన్ రిట్రీవర్ ఈ జాతి కుక్కలు అందరికీ తెలిసినవే.. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా తెలిసిన,అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిలో ఒకటి. గోల్డెన్ రిట్రీవర్ కుక్కలు నిజంగా పెంపుడు జంతువులలో ఉత్తమ జాతి. అందుకే ఇవి కోట్లాది జంతు ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టాయి. వాటిలో అంత ప్రత్యేకత ఏముందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాటిని పెంచుకుంటున్న యజమానులు మాత్రం వాటి గురించి తప్పనిసరిగా తెలిసే ఉంటారు. వాటి ప్రేమ, అప్యాయతను అనుభవించే ఉంటారు. అలాంటి స్నేహపూర్వక, సున్నితమైన కుక్కలు గోల్డెన్ రిట్రీవర్..సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో పోస్ట్ చేయబడింది. ఈ ఖాతాకు 2.7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రెగ్యులర్ గోల్డెన్ రిట్రీవర్ వీడియోలు ఇక్కడ పోస్ట్ చేయబడతాయి. ఈ వీడియోను 2.3 లక్షల మందికి పైగా చూశారు. దీనికి 13,200 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.

గోల్డెన్ రిట్రీవర్స్ అంటే యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రత్యేకంగా స్కాట్లాండ్‌లో 1850 కి చెందిన కుక్కలు. వేట వాటి గొప్ప నైపుణ్యం, నీటిలో అన్ని రకాల భూభాగాలపై అవి సులువుగా జీవించగలుగుతాయి. గోల్డెన్ రిట్రీవర్స్ ప్రారంభమైనప్పటి నుండి వేట కుక్కగా ఉపయోగించబడుతున్నాయి. ఇవి ఫ్యామిలీస్‌కి సరైనది.. ఎందుకంటే, మీ సహనం బాగా తెలుసు.

ఇవి కూడా చదవండి

అవి పిల్లలు, వృద్ధులు, అందరినీ అర్థం చేసుకుని మసులుకుంటాయి. అపరిచితులతో చాలా దయ, స్నేహపూర్వకంగా ఉంటాయి.. ఇది కాపలా కుక్కగా మాత్రం పనికి రాదనే చెప్పాలి. కానీ దాని మంచి లక్షణాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది కుటుంబాలలో చోటు సంపాదించాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి