Viral Video: క్లాస్‌ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న స్కూల్‌ గర్ల్స్‌.. నెట్టింట వీడియో హల్‌చల్‌

ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక ప్రైవేట్ స్కూల్‌ గర్ల్స్‌ ఒకరి నోకరు జుట్లు పట్టుకుని క్లాస్‌ రూమ్‌లో కొట్టుకున్నారు. తోటి విద్యార్థులు వారిని విడిపించేందుకు ప్రయత్నించినా

Viral Video: క్లాస్‌ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న స్కూల్‌ గర్ల్స్‌.. నెట్టింట వీడియో హల్‌చల్‌
School Girls
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 29, 2022 | 5:27 PM

Viral Video: విచ్చలవిడి టెక్నాలజీ, ఇంటర్‌ నెట్‌ వినియోగం ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతిరోజూ..ఎన్నో రక రకాల వీడియోలు ఇంటర్‌ నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. అలాంటి వీడియోలు నెటిజన్లు ఎంతగానో ఆకర్షిస్తాయి. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక ప్రైవేట్ స్కూల్‌ గర్ల్స్‌ ఒకరి నోకరు జుట్లు పట్టుకుని క్లాస్‌ రూమ్‌లో కొట్టుకున్నారు. తోటి విద్యార్థులు వారిని విడిపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. క్లాస్‌ రూమ్‌లోనే కుమ్మేసుకుంటున్న బాలికలకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో జరిగింది గర్ల్స్‌ఫైటింగ్‌ సీన్‌. ప్రైవేట్‌ స్కూల్‌కు చెందిన బాలికలు తరగతి గదిలో కొట్టుకున్నారు. స్కూల్‌ యూనిఫాంలో ఉన్న ముగ్గురు బాలికలు ఒకరి జట్టు మరొకరు పట్టుకున్నారు. ఆపై చేతులతో కొట్టుకున్నారు. అయితే ఆ క్లాస్‌లోని మిగతా బాలికలు సర్దిచెప్పేందుకు, వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారు ఒకరి జుట్టు ఒకరు విడిచిపెట్టకుండా చాలా సేపు కొట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ‘ఎక్స్‌ట్రా కో కరిక్యులర్ యాక్టివిటీస్‌కు ఫుల్‌ మార్కులు’ అంటూ ఒకరు చమత్కరించారు. కాగా, తమ స్కూళ్లలో కూడా ఇలాంటి ఫైటింగ్‌లు జరిగినట్లు మరి కొందరు గుర్తు చేసుకున్నారు.