Noida Twin Tower: ట్విన్ ట‌వ‌ర్ కూల్చివేతపై ఆనంద్‌మ‌హీంద్ర ట్విట్‌.. అందరికీ ఇదో అందమైన సందేశం..!

అందుకే ఆనంద్ మహీంద్రాకు సోష‌ల్ మీడియాలో ఫాలోంగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆనంద్‌ మహీంద్ర మరో పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌లో నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్ కూలిపోతున్న వీడియోను

Noida Twin Tower: ట్విన్ ట‌వ‌ర్ కూల్చివేతపై ఆనంద్‌మ‌హీంద్ర ట్విట్‌.. అందరికీ ఇదో అందమైన సందేశం..!
Anand Mahindra
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 29, 2022 | 6:03 PM

Noida Twin Tower: ప్ర‌ముఖ పారిశ్రామిక, వ్యాపార‌వేత్త‌, మ‌హీంద్ర అండ్ మ‌హీంద్ర కంపెనీ అధినేత ఆనంద్ మ‌హీంద్ర.. ఆనంద్ మహీంద్రా అద్భుతమైన చమత్కారుడు. అతని ట్వీట్ ప్రతి సందర్భానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఆయన ట్వీట్‌ను వేలాది మంది లైక్ చేస్తున్నారు. అతను తరచుగా వినూత్న విషయాలపై వీడియోలను పంచుకుంటారు. ఆయ‌న నిత్యం ఏదో ఒక పోస్టు చేస్తూ.. నెటిజ‌న్లను త‌న వైపు తిప్ప‌కుంటారు. అలాగే లోక‌ల్ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. వారి ప్ర‌తిభ‌ను మెచ్చి.. వారికి చేయూత‌ను ఇచ్చిన సంద‌ర్బాలు చాలానే ఉన్నాయి. అందుకే ఆనంద్ మహీంద్రాకు సోష‌ల్ మీడియాలో ఫాలోంగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆనంద్‌ మహీంద్ర మరో పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌లో నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్ కూలిపోతున్న వీడియోను మండే మోటివేష‌న్‌గా మ‌లుచుకున్న ఆనంద్ మ‌హీంద్ర ఈ పోస్ట్‌తో ప్రజలకు ఓ అందమైన సందేశాన్ని అందించారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో మొదటగా ట్విన్ టవర్లు కూలిపోతున్నట్లు చూపించారు. వీడియోలో వివిధ ప్రాంతాల నుండి వివిధ కోణాల నుండి భవనం పడిపోతుంది. ‘ట్విన్ ట‌వ‌ర్స్‌ను నా మండే మోటివేష‌న్‌గా ఎంచుకోవ‌డానికి ఓ కార‌ణ‌ముందన్నారు ఆనంద్‌ మహీంద్ర. ఈ వీడియోతో పాటు ఇలా రాశారు. ఇది మన అహం పెరుగుతున్న ప్రమాదాన్ని గుర్తుచేస్తుంది. “మనలో పెరిగిన ఈ అహాన్ని నాశనం చేయడానికి కొన్నిసార్లు మనకు పేలుడు పదార్థాలు అవసరం. అంటూ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజ‌న్లు సానుకూలంగా స్పందించారు. చాలామంది ఈ ట్వీట్‌తో ఏకీభ‌వించారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌కి ఒకరోజు ముందు కూడా ఆనంద్ మహీంద్రా ఒక వీడియోను పోస్ట్ చేసి కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్‌ చేశారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లతో కప్పబడి ఉన్న అందమైన వీడియోను పోస్ట్ చేశాడు. కారు ఈ రోడ్డు లోపలికి రాగానే సొరంగం గుండా వెళుతున్నట్లు అనిపిస్తుంది. భారత్‌లో కూడా అలాంటి రోడ్లను నిర్మించాలని ఆనంద్ మహీంద్రా నితిన్ గడ్కరీని అభ్యర్థించారు. ఈ రోడ్డుకు ‘ట్రన్నెల్’ అని పేరు పెట్టాడు. ఆ రోడ్డు మార్గానికి రెండు పక్కల పెద్ద ఎత్తున చెట్లు ఉన్నాయి. చెట్లకు అవతలి నుంచి చూస్తుంటే ఆ మార్గం నిజంగానే ఒక టన్నెల్‌ను పోలినట్లుగానే ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి