Viral: కడుపు ఉబ్బిపోయి, వాంతులతో ఆస్పత్రికొచ్చిన బాలిక.. స్కాన్ చేయగా డాక్టర్లకు మైండ్ బ్లాంక్!

ఓ బాలికకి కడుపు ఉబ్బిపోయి.. పదేపదే వాంతులు అవుతుండటంతో.. ఆమె కుటుంబసభ్యులు కంగారుపడి..

Viral: కడుపు ఉబ్బిపోయి, వాంతులతో ఆస్పత్రికొచ్చిన బాలిక.. స్కాన్ చేయగా డాక్టర్లకు మైండ్ బ్లాంక్!
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 29, 2022 | 7:40 PM

ఓ బాలికకి కడుపు ఉబ్బిపోయి.. పదేపదే వాంతులు అవుతుండటంతో.. ఆమె కుటుంబసభ్యులు కంగారుపడి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడున్న డాక్టర్లు సదరు యువతికి పరీక్షలు చేయించి.. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌‌లోని జోద్‌పూర్ మహాత్మాగాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. ఓ బాలికకు కడుపు ఉబ్బిపోయి.. తీవ్రమైన నొప్పితో పదేపదే వాంతులు వస్తుండటంతో.. ఆమె కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడున్న వైద్యులు ఆమెకు టెస్టులు నిర్వహించగా.. కడుపులో వెంట్రుకలతో కూడిన గడ్డ ఉన్నట్లు గుర్తించారు. సదరు బాలిక ట్రైకోఫాగియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు.

మొదటిగా డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా ఆ వెంట్రుకల గడ్డను తొలగించేందుకు ప్రయత్నించగా.. అది విఫలమైంది. అనంతరం శస్త్రచికిత్స నిర్వహించి కడుపులో నుంచి వెంట్రుకలను తొలగించారు. ఆపరేషన్ అనంతరం రోగి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. సదరు బాలికకు చిన్నప్పటి నుంచి వెంట్రుకలు తినే అలవాటు ఉందని కుటుంబీకులు తెలిపారు. ఆమెకున్న ఈ అలవాటు తప్పించేందుకు వారు ఎంత ప్రయత్నించినా కుదర్లేదట.

వెంట్రుకలను జీర్ణం చేసే సామర్థ్యం మానవ అలిమెంటరీ కెనాల్‌‌కు లేదని.. ఇందువల్ల అవన్నీ కూడా ఓ చోట గడ్డలా పేరుకుపోతాయని డాక్టర్లు చెప్పారు. మానసిక రుగ్మతులు లేదా న్యూరోటిక్ సమస్యతో 15-30 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ఈ వ్యాధిని చూడవచ్చునని.. అయితే సదరు బాలికకు మాత్రం ఎలాంటి మానసిక లేదా నరాల బలహీనత వంటి లక్షణాలు ఏం లేవని డాక్టర్లు పేర్కొన్నారు. పొట్ట, చిన్నపేగు ప్రారంభ భాగాన్ని వెంట్రుకలు పూర్తిగా మూసివేయడంతో.. ఆమె ఏం తిన్నా కూడా వాంతి చేసుకుంటోందని.. అందుకే ఆపరేషన్ చేసి వెంట్రుకలను తొలగించామని డాక్టర్లు అన్నారు. కాగా, సుమారు 25 అంగుళాలు పొడవు, 12.5 అంగుళాల పరిమాణంలో ఉన్న వెంట్రుకలతో కూడిన గడ్డను సదరు బాలిక కడుపులో నుంచి డాక్టర్లు తొలగించారు.(Source)

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్