Surekha Vani: నా అకౌంట్ హ్యాక్ అయ్యింది.. ఆ వీడియోస్ షేర్ చేయకండి.. సురేఖ వాణి ఆగ్రహం..
ప్రస్తుతం సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీ ప్రపంచంలో ఏది నిజం.. ఏది అబద్ధం అనేది కనిపెట్టడం చాలా కష్టంగా మారిపోయింది. ముఖ్యంగా సినీ తారల విషయాల్లో డీఫ్ ఫేక్ వీడియోస్, ఫోటోస్ వైరల్ కావడం నెట్టింట తీవ్ర దుమారం రేపుతుంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. తాజాగా టాలీవుడ్ సహాయ నటి సురేఖ వాణి సైతం ఈ డీప్ ఫేక్ బారిన పడినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖా వాణి. సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈమధ్య కాలంలో సినిమాల్లో తక్కువగా కనిపించినప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. నిత్యం ఫోటోషూట్స్ అంటూ నెట్టింట సందడి చేస్తున్నారు. అయితే ఇదివరకు చాలాసార్లు వ్యక్తిగత విషయాలతో వార్తలలో నిలిచారు సురేఖ వాణి. గతంలో రెండో పెళ్లి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన ఆమె.. ఇప్పుడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమెకు సంబంధించి తాజాగా ఒక వ్యక్తిగత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం కలకలం రేపింది. గడిచిన రెండు రోజులుగా ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుండగా, కొందరు దీనిని వ్యక్తిగత స్వేచ్ఛగా సమర్థిస్తుంటే మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వీడియోపై నటి సురేఖ వాణి స్పందించారు.
ఈ వివాదంపై స్పందించిన నటి సురేఖా వాణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ క్లారిటీ ఇచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని, తన అనుమతి, ప్రమేయం లేకుండానే కొన్ని వ్యక్తిగత, ప్రైవేట్ కంటెంట్‌ను కొందరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేవలం వ్యూస్, రీచ్ , పబ్లిసిటీ కోసం కొందరు ఈ పరిస్థితిని దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. “నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయ్యింది. నా వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ, నా అనుమతి లేకుండా కొందరు ప్రైవేట్ కంటెంట్ ను దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్, నెటిజన్స్ ఎవరైనా సరే.. ఈ కంటెంట్ రీపోస్ట్ చేయడం, షేర్ చేయడం తక్షణమే ఆపండి. కేవలం వ్యూస్ కోసం మరొకరు వ్యక్తిగత జీవితాన్ని అడ్డుపెట్టుకోవద్దు. ప్రైవేట్ డేటాను సర్క్యులేట్ చేస్తున్న అకౌంట్లు, వ్యక్తుల వివరాలను సాంకేతికంగా గుర్తిస్తున్నాం. ఇప్పటికే ఆధారాలు సేకరిస్తున్నాం. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠినమైన సైబర్ క్రైమ్ కేసులు, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో నేను ఏమాత్రం వెనకడుగు వేయను” అంటూ పోస్ట్ చేశారు.
ఈ అంశంపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తూ.. మీమ్ పేజీలు, మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, యూట్యూబ్ ఛానెళ్లు , వ్యక్తులు ఎవరూ కూడా ఈ ప్రైవేట్ కంటెంట్‌ను రీపోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం లేదా షేర్ చేయడం చేయవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా సరే ఈ వీడియోలను షేర్ చేసినట్లు లేదా ప్రచారం చేసినట్లు గుర్తిస్తే, వారిని గుర్తించి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తన వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని సురేఖా వాణి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సురేఖ వాణి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
సురేఖ వాణి పోస్ట్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
