AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: పాక్‌తో కీలక పోరుకు సిద్ధమైన భారత్.. ఆసియా కప్‌లో రేపు హై వోల్టేజ్ మ్యాచ్!

India U19 vs Pakistan U19: ఏడాది చివర్లో మరోసారి భారత్, పాకిస్థాన్ క్రికెట్ సమరం జరగనుంది. ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా ఇరు జట్లు తలపడనున్నాయి. గ్రూప్-ఏలో జరిగే ఈ కీలక పోరులో గెలిచి సెమీఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

IND vs PAK: పాక్‌తో కీలక పోరుకు సిద్ధమైన భారత్.. ఆసియా కప్‌లో రేపు హై వోల్టేజ్ మ్యాచ్!
Ind U19 Vs Pak U19
Venkata Chari
|

Updated on: Nov 07, 2026 | 1:03 PM

Share

India U19 vs Pakistan U19: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) పోరుకు రంగం సిద్ధమైంది. ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో గ్రూప్-ఏలో ఉన్న భారత్, పాకిస్థాన్ మధ్య నవంబర్ 8న కీలక మ్యాచ్ జరగనుంది. ఒమన్‌లోని అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్ ఈ పోరుకు వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఇరు జట్లు ఈ పోరులోనూ గెలిచి గ్రూపులో తమ ఆధిపత్యాన్ని చాటాలని చూస్తున్నాయి. యువ ఆటగాళ్ల ప్రతిభకు ఈ మ్యాచ్ మంచి పరీక్షగా నిలవనుంది.

తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం

భారత అండర్-19 జట్టు (India U19) ఈ టోర్నీలో శుభారంభం చేసింది. నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 128 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత యువ బ్యాటర్లు వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించారు. 129 పరుగుల లక్ష్యాన్ని 10 వికెట్ల తేడాతో సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో భారత జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.

పాక్ కూడా విజయంతోనే బరిలోకి

మరోవైపు పాకిస్థాన్ అండర్-19 జట్టు (Pakistan U19) కూడా తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన పోరులో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు 224 పరుగులు చేయగా, పాకిస్థాన్ 225/1 స్కోరుతో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ కూడా మంచి ఫామ్‌లో ఉంది.

ఆసక్తికరంగా భారత్-పాక్ పోటీ

భారత్, పాకిస్థాన్ యువ జట్ల మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. గతంలో జరిగిన అండర్-19 ప్రపంచకప్, ఆసియా కప్ మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈసారి కూడా గ్రూప్-ఏలో కీలకమైన ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా భారత బ్యాటింగ్, పాకిస్థాన్ బౌలింగ్ మధ్య పోటీ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. రెండు జట్లు తొలి మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించడంతో ఈ పోరుపై అంచనాలు పెరిగాయి.

మ్యాచ్: ఇండియా అండర్-19 vs పాకిస్థాన్ అండర్-19

టోర్నీ: ACC Men’s U19 Asia Cup 2026

మ్యాచ్: 8వ మ్యాచ్, గ్రూప్-A

తేదీ: నవంబర్ 8, 2026

సమయం: ఉదయం 10:30 గంటలు (IST)

వేదిక: అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్, ఒమన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs PAK: ఆసియా కప్‌లో రేపు హై వోల్టేజ్ మ్యాచ్!
IND vs PAK: ఆసియా కప్‌లో రేపు హై వోల్టేజ్ మ్యాచ్!
దీపావళి స్పెషల్ విషెస్.. మీ సన్నిహితుల మనసు గెలుచుకునే అద్భుతమైన
దీపావళి స్పెషల్ విషెస్.. మీ సన్నిహితుల మనసు గెలుచుకునే అద్భుతమైన
నేనెప్పుడు బాగుండాలని కోరుకునే నిజమైన స్నేహితుడు అతడే..
నేనెప్పుడు బాగుండాలని కోరుకునే నిజమైన స్నేహితుడు అతడే..
ధోనీని మాహి చాచు అని పిలుస్తా.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు!
ధోనీని మాహి చాచు అని పిలుస్తా.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు!
పరిషత్ పోరులో కూటమి దూకుడు.. ఇప్పటి వరకు గెలిచిన స్థానాలు ఇవే!
పరిషత్ పోరులో కూటమి దూకుడు.. ఇప్పటి వరకు గెలిచిన స్థానాలు ఇవే!
బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.. బెల్లం పొంగడాలు తయారీ విధానం ఇదిగో!
బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.. బెల్లం పొంగడాలు తయారీ విధానం ఇదిగో!
ఐపీఎల్ 2027 వేలంలో ఆ ఇద్దరే టార్గెట్.. గంగూలీ సంచలన ప్రకటన..!
ఐపీఎల్ 2027 వేలంలో ఆ ఇద్దరే టార్గెట్.. గంగూలీ సంచలన ప్రకటన..!
ఇంటి ముందు కార్లు బారులు తీరేవి.. డేట్స్ కోసం ఎదురుచూసిన స్టార్ హ
ఇంటి ముందు కార్లు బారులు తీరేవి.. డేట్స్ కోసం ఎదురుచూసిన స్టార్ హ
హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్.. ఈ మార్గంలో కూడా వన్ వే విధానం
హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్.. ఈ మార్గంలో కూడా వన్ వే విధానం
దీపావళి స్పెషల్.. ఎండు మిర్చి కోడి వేపుడు.. 10 నిముషాల్లోనే
దీపావళి స్పెషల్.. ఎండు మిర్చి కోడి వేపుడు.. 10 నిముషాల్లోనే