AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayanam: రామాయణం సినిమాకు 6 కోట్లు రెమ్యునరేషన్.. క్యాన్సర్ పిల్లల చికిత్సకు ఇచ్చేసిన స్టార్ హీరో.. నెటిజన్స్ రియాక్షన్స్ చూస్తే..

నితీష్ తివారీ ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం 'రామాయణం'లో విభీషణుడి పాత్రకు గాను తనకు రావలసిన రూ. 6 కోట్ల పారితోషికాన్ని పూర్తిగా విరాళంగా ప్రకటించారు ఓ హీరో. అంతేకాకుండా తన 50వ పుట్టినరోజు సందర్భంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న 50 మంది నిరుపేద చిన్నారుల ఉచిత వైద్య చికిత్సను అదందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నిజమైన మానవత్వాన్ని చాటుకుంటూ రియల్ హీరోగా నిలిచారు.

Ramayanam: రామాయణం సినిమాకు 6 కోట్లు రెమ్యునరేషన్.. క్యాన్సర్ పిల్లల చికిత్సకు ఇచ్చేసిన స్టార్ హీరో.. నెటిజన్స్ రియాక్షన్స్ చూస్తే..
Vivek Oberoi
Rajitha Chanti
|

Updated on: Nov 07, 2026 | 10:14 AM

Share

సినిమా తెరపై విలన్‌గా, హీరోగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన బాలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్. తాజాగా నిజజీవితంలో తన ఉదారతతో రియల్ హీరో అనిపించుకున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం రామాయణం. ఈ మూవీలో విభీషణుడి పాత్రలో నటించినందుకు తనకు రావాల్సిన రూ. 6 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను ఆయన ఒక పైసా కూడా తీసుకోకుండా, క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారుల వైద్య సహాయం కోసం విరాళంగా ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వివేక్ ఒబెరాయ్ తన రెమ్యునరేషన్ మొత్తాన్ని తనకు వద్దని, ఆ రూ. 6 కోట్లను క్యాన్సర్ బాధితులైన చిన్నపిల్లల చికిత్సకే నేరుగా అందించాలని చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాను స్వయంగా కోరారు. అంతటితో ఆగకుండా, తన 50వ పుట్టినరోజు సందర్భంగా తీవ్రమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న 50 మంది పేద చిన్నారుల పూర్తి వైద్య ఖర్చులను తానె స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజును ఇలాంటి గొప్ప సామాజిక సేవకు వినియోగించి, ఎన్నో నిరుపేద కుటుంబాల జీవితాల్లో ఆయన సరికొత్త వెలుగులు నింపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

ఈ సందర్భంగా వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. “నేను నమ్మే ఒక మంచి ఆశయం కోసం ఈ మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లల చికిత్సకు ఈ డబ్బు ఉపయోగపడటం కంటే నాకు మరేదీ ఎక్కువ సంతోషాన్ని ఇవ్వదు. ఈ సినిమా ద్వారా రూపాయి కూడా నేను తీసుకోకూడదని ముందే అనుకున్నాను” అని తెలిపారు. అంతేకాకుండా, భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై నిలబెట్టేలా రామాయణం చిత్రాన్ని రూపుదిద్దుతున్న తీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

సినిమాల్లో కనిపించే నటన మాత్రమే కాకుండా, నిజజీవితంలో సమాజం పట్ల బాధ్యతను, మానవత్వాన్ని చాటుకున్న వివేక్ ఒబెరాయ్ చేసిన ఈ అద్భుతమైన సేవపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ వర్గాలు , అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. మరోవైపు రామాయణం చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మొదటి రోజే రూ.150 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

వివేక్ ఓబేరాయ్..

Vivek Oberoi New

Vivek Oberoi New

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us
రీల్ హీరో కాదు.. రియల్ హీరో.. చిన్నారుల చికిత్సకు 6 కోట్లు విరాళం
రీల్ హీరో కాదు.. రియల్ హీరో.. చిన్నారుల చికిత్సకు 6 కోట్లు విరాళం
దీపావళి రోజున లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించే బెల్లం పొంగడాలు
దీపావళి రోజున లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించే బెల్లం పొంగడాలు
గచ్చిబౌలి హోటల్‌లో అమెరికా వాసి అనుమానాస్పద మృతి
గచ్చిబౌలి హోటల్‌లో అమెరికా వాసి అనుమానాస్పద మృతి
రెండ్రోజులు బ్యాంక్‌లు బంద్.. వచ్చే వారంలో సెలవులు ఇవే..
రెండ్రోజులు బ్యాంక్‌లు బంద్.. వచ్చే వారంలో సెలవులు ఇవే..
2 నెలలు నిద్రపోతే చాలు.. రూ.9.6 లక్షల ప్రైజ్ మనీ, ఫారిన్ ట్రిప్!
2 నెలలు నిద్రపోతే చాలు.. రూ.9.6 లక్షల ప్రైజ్ మనీ, ఫారిన్ ట్రిప్!
భార్య పేరుతో గోల్డ్ కొనుగోలు చేస్తే పన్ను ఎవరు కట్టాలి..?
భార్య పేరుతో గోల్డ్ కొనుగోలు చేస్తే పన్ను ఎవరు కట్టాలి..?
APPSC గ్రూప్ 2లో 686 ఉద్యోగాలు.. నవంబర్ 10 నుంచి దరఖాస్తులు షురూ
APPSC గ్రూప్ 2లో 686 ఉద్యోగాలు.. నవంబర్ 10 నుంచి దరఖాస్తులు షురూ
Video: కిటికీ దగ్గర కూర్చుంది.. అంతలోనే ఘోరం!
Video: కిటికీ దగ్గర కూర్చుంది.. అంతలోనే ఘోరం!
మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించాడు.. నటి అతుల్య చంద్ర ఫిర్యాదు
మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించాడు.. నటి అతుల్య చంద్ర ఫిర్యాదు
ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళీ థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళీ థ్రిల్లర్ డ్రామా..