AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి రోజున లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించే బెల్లం పొంగడాలు

దీపావళి పండుగ అంటేనే తీపి వంటకాలు, పండుగ సంబరాలు. ఈ ప్రత్యేక సందర్భంలో లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించే బెల్లం పొంగడాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. సాధారణంగా పొంగడాలు తయారుచేయాలంటే పాకం పట్టడం, తడి పిండి చేసుకోవడం వంటివి చాలామందికి కష్టంగా అనిపిస్తాయి. అయితే, సులభమైన పద్ధతిలో ఎవరైనా చాలా తేలికగా, తక్కువ శ్రమతో, అద్భుతమైన రుచితో ఈ పొంగడాలను సిద్ధం చేసుకోవచ్చు

Prasanna Yadla
|

Updated on: Nov 07, 2026 | 10:14 AM

Share

కావాల్సిన పదార్థాలు: బియ్యం: 2 కప్పులు ,  తురిమిన బెల్లం: 2 కప్పులు, గోధుమ పిండి / మైదా పిండి: 1/4 కప్పు (పిండి పల్చదనాన్ని బట్టి), నెయ్యి: 1 టేబుల్‌స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు: 1/2 కప్పు (చిన్నగా తరిగినవి), నువ్వులు: 1 టేబుల్‌స్పూన్, యాలకుల పొడి: 1/2 టీస్పూన్ (లేదా 4 యాలకులు), వంట సోడా (బేకింగ్ సోడా): 1/8 టీస్పూన్, నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా తీసుకోవాలి.

1 / 5
ముందుగా 2 కప్పుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి, రాత్రంతా లేదా కనీసం 10-15 గంటల పాటు నానబెట్టాలి. ఎక్కువసేపు నానబెడితే నీటిని ఒకసారి మార్చడం మంచిది.బియ్యం బాగా నానిన తర్వాత నీరంతా వంపేసి, మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. చాలా తక్కువ నీళ్లు పోస్తూ, పిండిని వీలైనంత మెత్తగా, కొంచెం గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా అయితే, పొంగడాలు సరిగా రావు.

2 / 5
గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిలో 2 కప్పుల తురిమిన బెల్లం వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం వేసాక పిండి ఇంకా పల్చన అవుతుంది కాబట్టి, గ్రైండింగ్ చేసేటప్పుడు బియ్యం పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి.గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో 1/4 కప్పు గోధుమ పిండి లేదా మైదా పిండిని కలపాలి. మీ పిండి మరీ పల్చగా అనిపిస్తే కొద్దిగా ఎక్కువ గోధుమ పిండి కలుపుకోవచ్చు.

3 / 5
స్టవ్‌పై డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి మీడియం మంటపై వేడి చేయాలి. నూనె మరీ పొగలు వచ్చేంత వేడిగా ఉండకూడదు, కొంచెం పిండి వేస్తే నిదానంగా పైకి తేలేంత వేడి ఉండాలి. ఒక గుంట గరిటెడు పిండిని తీసుకుని, అదనపు పిండిని తీసేసి, కాగిన నూనెలోకి నిదానంగా వేయాలి. నూనె సగం కంటే తక్కువగా ఉండాలి. పొంగడం పైకి తేలిన తర్వాత, గరిటెతో పైనుంచి నూనె పోస్తూ ఉంటే చక్కగా పొంగుతుంది.

4 / 5
అంచులు ఎర్రగా అయ్యేంత వరకు ఒకవైపు కాల్చి, తర్వాత రెండో వైపుకు తిప్పి బంగారు రంగు వచ్చేవరకు మీడియం మంటపై కాల్చాలి. లోపల వరకు ఉడకడానికి మీడియం మంట అవసరం. రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత, నూనెలోంచి తీసి టిష్యూ పేపర్‌పై వేసుకోవాలి. ప్రతిసారి పొంగడాలు వేసే ముందు పిండిని బాగా కలుపుకోవడం మంచిది. ఈ పొంగడాలు చుట్టూ క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్‌గా ఉండి, కొబ్బరి, నువ్వుల రుచితో చాలా బాగుంటాయి.

5 / 5
Follow Us
రీల్ హీరో కాదు.. రియల్ హీరో.. చిన్నారుల చికిత్సకు 6 కోట్లు విరాళం
రీల్ హీరో కాదు.. రియల్ హీరో.. చిన్నారుల చికిత్సకు 6 కోట్లు విరాళం
దీపావళి రోజున లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించే బెల్లం పొంగడాలు
దీపావళి రోజున లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించే బెల్లం పొంగడాలు
గచ్చిబౌలి హోటల్‌లో అమెరికా వాసి అనుమానాస్పద మృతి

రెండ్రోజులు బ్యాంక్‌లు బంద్.. వచ్చే వారంలో సెలవులు ఇవే..

2 నెలలు నిద్రపోతే చాలు.. రూ.9.6 లక్షల ప్రైజ్ మనీ, ఫారిన్ ట్రిప్!

భార్య పేరుతో గోల్డ్ కొనుగోలు చేస్తే పన్ను ఎవరు కట్టాలి..?

APPSC గ్రూప్ 2లో 686 ఉద్యోగాలు.. నవంబర్ 10 నుంచి దరఖాస్తులు షురూ

Video: కిటికీ దగ్గర కూర్చుంది.. అంతలోనే ఘోరం!

మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించాడు.. నటి అతుల్య చంద్ర ఫిర్యాదు

ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళీ థ్రిల్లర్ డ్రామా..