ఢిల్లీలోని ఓ పాఠశాలలో తొమ్మిదేళ్ల బాలిక క్లాస్‌రూమ్‌లో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. తమ కూతురికి ఎలాంటి జబ్బు లేదని, స్కూల్ నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని తండ్రి ఆరోపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, చిన్న వయసులో గుండెపోటుపై వైద్య నిపుణుల్లో చర్చ జరుగుతోంది.