AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి స్పెషల్.. పెసర గారెలు .. ఇలా చేస్తే రెండు ప్లేట్స్ పక్కా లాగిస్తారు

పెసర గారెలు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఇష్టంగా తింటారు.ఇవి సాయంత్రం స్నాక్ గా లేదా అల్పాహారంగా చాలా రుచికరంగా ఉంటాయి. చాలామంది గారెలు నూనె పీల్చుకుంటాయని అనుకుంటారు, కానీ సరైన పద్ధతిలో చేస్తే పెసర గారెలు నూనెను అస్సలు పీల్చకుండా, పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా అద్భుతంగా వస్తాయి. వీటిని పెసర వడలు అని కూడా పిలుస్తారు.

Prasanna Yadla
|

Updated on: Nov 07, 2026 | 7:26 AM

Share
కావాల్సిన పదార్థాలు: పెసలు – 2 కప్పులు, అల్లం – 3 అంగుళాలు,  పచ్చిమిర్చి – 6, ఎండుమిర్చి – 4,   మీడియం సైజు ఉల్లిపాయలు – 2 (చిన్నగా తరిగినవి),  కరివేపాకు – తగినంత, కొత్తిమీర – తగినంత (చిన్నగా తరిగినవి),  జీలకర్ర – 1/2 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా తీసుకోవాలి.

1 / 5
ముందుగా రెండు కప్పుల ఆకుపచ్చ పెసలను తీసుకొని, శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కనీసం ఆరు గంటల పాటు నానబెట్టాలి. పెసలు పూర్తిగా నానడం చాలా ముఖ్యం, సరిగ్గా నానకపోతే గారెలు గట్టిగా వస్తాయి. బొబ్బర్లు, శెనగలతో పోలిస్తే పెసలు నానడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి బాగా నానిన తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి. అదనంగా నీటిని తీసేయాల్సిన అవసరం లేదు.
 ఒక మిక్సీ జార్ లో 3 అంగుళాల అల్లం ముక్కలు, 6 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిర్చి కలపడం వల్ల గారెలకు మరింత రుచి వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ముందుగా రెండు కప్పుల ఆకుపచ్చ పెసలను తీసుకొని, శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కనీసం ఆరు గంటల పాటు నానబెట్టాలి. పెసలు పూర్తిగా నానడం చాలా ముఖ్యం, సరిగ్గా నానకపోతే గారెలు గట్టిగా వస్తాయి. బొబ్బర్లు, శెనగలతో పోలిస్తే పెసలు నానడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి బాగా నానిన తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి. అదనంగా నీటిని తీసేయాల్సిన అవసరం లేదు. ఒక మిక్సీ జార్ లో 3 అంగుళాల అల్లం ముక్కలు, 6 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిర్చి కలపడం వల్ల గారెలకు మరింత రుచి వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

2 / 5
ఇప్పుడు అదే మిక్సీ జార్ లో నానబెట్టిన పెసలను వేసి, కొద్దిగా నీటిని జోడిస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. నీటిని ఎక్కువ పోయకుండా జాగ్రత్త పడాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూస్ గా ఉండకూడదు. సరైన పదునులో ఉండేలా చూసుకోవాలి. పిండి గట్టిగా ఉంటే గారెలు కూడా గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. రుబ్బిన పిండిని అల్లం, మిర్చి మిశ్రమం ఉన్న గిన్నెలోకి మార్చుకోవాలి.

3 / 5
ఈ పిండి మిశ్రమంలో చిన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు, తగినంత కరివేపాకు, కొత్తిమీర (కొంచెం ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుంది), అర టీస్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలు గానీ, ఇతర సుగంధ ద్రవ్యాలు గానీ అవసరం ఉండదు. అల్లం, మిరపకాయల రుచి ఈ గారెలకు సరిపోతుంది. గారెలు ఒత్తుకోవడానికి బట్టర్ పేపర్, అరిటాకు లేదా ప్లాస్టిక్ కవర్ ను ఉపయోగించవచ్చు. పేపర్ ను కొద్దిగా తడిపి, పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి, బట్టర్ పేపర్ పై పెట్టి పలుచగా కాకుండా, మందంగా కాకుండా సమానంగా ఒత్తుకోవాలి. మధ్యలో చిన్న రంధ్రం చేసుకోవాలి. గారెలు ఒత్తేటప్పుడు చేయి తడి చేసుకుంటే పిండి చేతికి అంటుకోకుండా సులువుగా వస్తుంది. ఒక వాయికి సరిపడా గారెలను ముందుగా ఒత్తి పక్కన పెట్టుకోవచ్చు.

4 / 5
డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను కడాయిలో పోసి వేడి చేయాలి. నూనె సమానంగా వేడవ్వాలి కానీ మరీ పొగలు వచ్చేంత వేడిగా ఉండకూడదు. నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, ఒత్తుకున్న గారెలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా నూనెలో వేయాలి. గారెలు వేసిన వెంటనే గరిటెతో కదపకూడదు. కాసేపు వేగిన తర్వాత కడాయి అంచులకు అంటుకున్నవి విడివడి పైకి వస్తాయి. అప్పుడు నెమ్మదిగా అటు ఇటు తిప్పుతూ బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ సేపు వేయించకూడదు, అలా చేస్తే గారెలు మరీ గట్టిగా అవుతాయి. చక్కగా వేగిన గారెలను నూనె నుంచి తీసి ప్లేట్ లోకి మార్చుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో గారెలను తయారు చేసుకోవాలి.

5 / 5
Follow Us