చలికాలంలో ఉసిరి తింటే ఎన్ని లాభాలో తెలుసా?

samatha

6 November 2026

Pic credit - Pinterest

ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో ఇది ఎక్కువగా లభిస్తుంది. అందు వలన చలికాలంలో దీనిని తినడం వలన బోలెడు లాభాలు ఉన్నాయని చెబుతుంటారు.

ఉసిరి

కాగా, ఇప్పుడు మనం చలికాలంలో ఉసిరి తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం పదండి.

ఆరోగ్య ప్రయోజనాలు

ఉసిరిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన చలికాలంలో రోజుకు ఒక ఉసిరికాయ తినడం వలన అది జలుబు, దగ్గు , గొంతు నొప్పి తగ్గిస్తుంది.

జలుబు, దగ్గు

అంతే రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. ఉసిరి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.

రోగనిరోధక శక్తి

చర్మ ఆరోగ్యానికి కూడా ఇది చాలా బెస్ట్. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి చర్మం మీద మచ్చలను తగ్గించి, చర్మానికి మేలు చేస్తాయి.

చర్మ ఆరోగ్యం

జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఉసిరిలో  ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి.

జీర్ణక్రియ 

జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు దీనిని తినడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

జుట్టు

అలాగే ఉసిరి తినడం వలన శరీరానికి శక్తి లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అన్ని విధాలుగా ప్రయోజనాలు చేకూరుస్తుంది.

శరీరానికి శక్తి