Tollywood : నేను తల్లిగా నటించాలా ? స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసింది.. కట్ చేస్తే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్..
బుల్లితెర సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన ప్రముఖ నటి అసుర్ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ స్పేస్‌లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన రూ. 1200 కోట్ల గ్లోబల్ బ్లాక్‌బస్టర్ మూవీ 'జవాన్'లో తల్లి పాత్రలో అద్భుతంగా మెప్పించి, బుల్లితెర స్థాయి నుంచి పాన్-ఇండియా గుర్తింపు సాధించిన నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన సినీ ప్రయాణాన్ని నిర్మించుకున్నారు.

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన చిత్రం ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. అయితే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్‌కు తల్లిగా నటించడంపై ప్రముఖ నటి రిధి డోగ్రా తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొదట తనకంటే పెద్ద వయసు ఉన్న హీరోకు తల్లి పాత్రలో నటించాలా అని ఆలోచించినట్లు ఆమె తెలిపారు. హిందీలో ప్రముఖ టెలివిజన్ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న రిధి డోగ్రా, ఆ తర్వాత వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో అకట్టుకున్నారు. ఈ క్రమంలోనే అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘జవాన్’ చిత్రంలో ఆమెకు కీలకమైన అవకాశం దక్కింది. అయితే కథ విన్నప్పుడు తన అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. “అట్లీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చినప్పుడు అసలు ఏ సినిమాకో నాకు తెలియదు. అక్కడికి వెళ్లిన తర్వాతే అది షారుఖ్ ఖాన్ ‘జవాన్’ అని తెలిసింది. అట్లీ నాకు కథ చెప్పినప్పుడు, ఈ పాత్రలో నేను సరిపోతానా అనిపించింది. ముఖ్యంగా యువ షారుఖ్ ఖాన్‌కు తల్లిగా నటించాల్సి రావడంతో మొదట కొంచెం సంకోచించాను” అని రిధి వెల్లడించారు.
అయినప్పటికీ, అప్పట్లో 38 ఏళ్ల వయసున్న రిధి డోగ్రా, 58 ఏళ్ల షారుఖ్ ఖాన్‌కు తల్లిగా నటించడానికి అంగీకరించారు. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో చిత్రంలో నటించే అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా అని ప్రశ్నించిన ఆమె, ఆ సినిమాలో భాగం కావడం ఒక కలలాంటి అనుభూతినిచ్చిందని తెలిపారు. తెరపై ఆమె చూపిన ఆలోచనకు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం రిధి డోగ్రా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బుల్లితెర సీరియల్స్‌తో నటిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో అగ్ర హీరోల చిత్రాల్లో మెరుస్తూ తనకంటూ ఒక బలమైన ముద్ర వేసుకున్నారు. ఆమె ప్రయాణం కేవలం ఒక నటిగా మాత్రమే కాకుండా, కథా బలమున్న పాత్రలను ఎంపిక చేసుకునే ప్రతిభావంతురాలైన ఆర్టిస్ట్‌గా సాగింది. రిధి డోగ్రా టెలివిజన్ రంగంలో ఎన్నో విజయవంతమైన సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా ‘మర్యాద.. లేకన్ కబ్ తక్?’, ‘వో హై బేసబ్’ వంటి ప్రముఖ సీరియల్స్‌తో ఆమె ఇంటింటి పేరుగా మారారు. టెలివిజన్‌లో ఆమె నటనకు మంచి గుర్తింపు రావడంతో పాటు, అప్పట్లోనే ఓ మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
రిధి డోగ్రా..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
