AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఏపీలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్.. ఎక్కడెక్కడంటే..?

ఏపీలో రెండు ఎయిర్‌పోర్ట్‌లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొమ్మిది కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు అనుమతి మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ప్రస్తుతానికి రెండు ఎయిర్‌పోర్టుల నిర్మాణ కోసం కేంద్ర విమానయానశాఖ అనుమతులు జారీ చేసింది. త్వరలో వీటి పనులు మొదలుకానున్నాయి.

Andhra News: ఏపీలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్.. ఎక్కడెక్కడంటే..?
Kuppam Airport
Venkatrao Lella
|

Updated on: Nov 07, 2026 | 11:13 AM

Share

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ అనుమతులు జారీ చేసింది. కుప్పం, శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు స్థల అనుమతి ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ప్రతిపాదనలు షురూ చేసింది. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (APADCL) ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేసింది. దీంతో ఈ ప్రతిపాదలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. భూసేకరణతో పాటు అభివృద్ది నమూనాలను పరిశీలన చేపడుతోంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ పనులు చేపట్టాలా లేదా ప్రభుత్వ, యజమాని సహకారంతో చేపట్టాలా అనే దానిపై సమాలోచనలు చేస్తోంది.

రెండు ఎయిర్‌పోర్టులకు గ్రీన్ సిగ్నల్

ఎయిర్ పోర్ట్ నిర్మాణాన్ని ఏ విధానంలో చేపట్టాలనే దానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖకు సమాచారం అందించనుంది. శ్రీకాకుళం ఎయిర్‌పోర్ట్‌కు రూ.750.52 కోట్లతో అంచనాలు సిద్దం చేయగా.. 1185 ఎకరాలు అవసరమవుతుందని మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 2030 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఇక కుప్పం ఎయిర్‌పోర్ట్ కోసం తొలి దశలో రూ.734 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా.. 1788 ఎకరాలు అవసరమవుతుంది. ఇప్పటికే 1300 ఎకరాల సేకరణ పూర్తయింది. భూసేకరణకు ప్రభుత్వం రూ.198.75 కోట్లు కేటాయించగా.. మౌలిక సదుపాయాల అభివృద్దికి రూ.146 కోట్లు ఖర్చు చేయనున్నారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. రెండు ఫేజ్‌లు కలిపి మొత్తం రూ.1142 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.

మొత్తం 9 ఎయిర్‌పోర్ట్‌లు

మొత్తం 9 ఎయిర్‌పోర్టులకు అనుమతి మంజూరు చేయాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు పంపించింది. నాగార్జున సాగర్, తాడేపల్లిగూడెం, ఒంగోలు, అనంతపురం, అమరావతి, దగదర్తి, తుని-అన్నవరం, శ్రీకాకుళం, కుప్పంలో విమానాశ్రయాలను అభివృద్ది చేయాలని ప్రతిపాదించింది.  మొత్తం 9 విమానాశ్రయాలను రూ.6,418 కోట్లతో అభివృద్ది చేయాలని ప్రతిపాదించింది. వీటిల్లో ప్రస్తుతానికి కుప్పం, శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టులకు స్థల అనుమతి మంజూరు చేసింది. ఉడాన్ 2.0 పథకం కూడా పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్‌ వద్ద ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ప్రబుత్వం ప్రతిపాదించింది. కేంద్ర తాజా అనుమతితో శ్రీకాకుళం, కుప్పం ఎయిర్‌పోర్ట్ పనులు ఊపందుకోనున్నాయి. త్వరలోనే టెండర్లను ఆహ్వానించి పనులను ప్రారంభించే అవకాశముంది. ఏపీలో గత కొద్ది నెలల క్రితం భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ప్రారంభమైంది. ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణికుల రాకపోకలు కొనసాగుతున్నాయి. అలాగే అనేక విమానాలు ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. ప్రయాణికులకు మాత్రమే కాకుండా సరకు రవాణాకు కూడా ఈ ఎయిర్ పోర్ట్ కీలకంగా ఉంది.

Follow Us