ఇక తగ్గదేలే.. ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్.. ప్రభుత్వం కీలక ఒప్పందం..
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఒప్పందం చేసుకున్నాయి. సవరించిన భారత్‌నెట్ ప్రోగ్రామ్‌లో భాగంగా తెలంగాణకు కేంద్రం రూ.3,185 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 12,769 గ్రామ పంచాయతీలకు రింగ్ నెట్‌వర్క్ కనెక్టివిటీ కల్పించడంతో పాటు 2.93 లక్షల గ్రామీణ కుటుంబాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అందించనున్నారు.

ప్రతీ పల్లెకూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కీలక అడుగువేశాయి. అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం MoU కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ కింద తెలంగాణకు కేంద్రం నుంచి రూ.3వేల 185 కోట్ల భారీ ఆర్థిక సాయం అందనుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామీణ ప్రాంతాల్లో టీ ఫైబర్ డిజిటల్ కనెక్టివిటీని మరింత వేగవంతం చేయనున్నారు. తెలంగాణలోని 12వేల 769 గ్రామ పంచాయతీలను రింగ్ నెట్‌వర్క్ కనెక్టివిటీతో అనుసంధానించనున్నారు.
ఇప్పటికే 10వేల 787 పంచాయతీల్లో ఈ నెట్‌వర్క్ ఉండగా, మరో 19వందల 46 పంచాయతీలను లీనియర్ నెట్‌వర్క్ నుంచి రింగ్ టోపాలజీకి అప్‌గ్రేడ్ చేస్తున్నారు. అదనంగా మరో 36 పంచాయతీల్లో కొత్తగా రింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొత్తగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏకంగా 2.93 లక్షల గ్రామీణ కుటుంబాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఇవ్వనున్నారు.
ఒక్కో గ్రామీణ కనెక్షన్‌కు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందనుంది. టీ ఫైబర్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ అమలు కానుంది. కేవలం నెట్‌వర్క్ నిర్మాణం మాత్రమే కాకుండా, వచ్చే పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకోనున్నారు.
ఇందుకోసం 2026 జూన్‌లో తెలంగాణ ప్రభుత్వం ట్రైకిల్ సంస్థను కూడా ఏర్పాటు చేసింది. ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తే పల్లెల్లోని ప్రజలకు ఆన్‌లైన్ విద్య, టెలీమెడిసిన్, ఈ-గవర్నెన్స్ సేవలు ఎంతో సులభంగా అందుతాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
