స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. బుల్లితెరపై మిగిలిపోయింది..

Rajitha Chanti

Pic credit - Instagram

06 November 2026

వెండితెరపై నటిగా ప్రయాణం ప్రారంభించి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ దివి వద్యా.

సరిపడా గ్లామర్, అద్భుతమైన ఫీచర్లతో పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ, సరైన బ్రేక్ లభించడం లేదు.

మహేష్ బాబు 'మహర్షి' వంటి సినిమాల్లో మెరిసినా, ఆమెకు అసలైన గుర్తింపు తెచ్చింది మాత్రం బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షోనే.

బిగ్ బాస్‌తో తెచ్చుకున్న పాపులారిటీతో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న దివి అవకాశాలు అంతగా రాలేదు. 

పలు చిత్రాల్లో సైడ్ రోల్స్ పోషించినప్పటికీ హీరోయిన్స్ ఛాన్సులు మాత్రం అంతగా రాలేదు. సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. 

తన ప్రేమ, పెళ్లి అభిప్రాయాలపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఆర్భాటాలు అవసరం లేదన్నారు.

చిన్న గౌరవం, ఒక చిన్న అప్రిషియేషన్ అమ్మాయిలకు చాలా సంతోషాన్ని ఇస్తాయని ఆమె చెప్పిన మాటలు వైరలవుతున్నాయి.

వివాహానికి ముందే ఆ వ్యక్తితో కొంతకాలం ప్రయాణం చేయాలని తాను భావిస్తున్నట్లు దివి పేర్కొన్నారు.