AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP MPTC, ZPTC Polls Result: పరిషత్ పోరులో కూటమి దూకుడు.. ఇప్పటి వరకు గెలిచిన స్థానాలు ఇవే!

AP MPTC, ZPTC Polls Result: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవిష్యత్తు బయటపడుతోంది. ఒక్కొక్కటి ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కూటమి పార్టీ అభ్యర్థులు పలు స్థానాల్లో విజయం సాధించగా.. ఒక చోట వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. పలు ప్రాంతాల్లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

AP MPTC, ZPTC Polls Result: పరిషత్ పోరులో కూటమి దూకుడు.. ఇప్పటి వరకు గెలిచిన స్థానాలు ఇవే!
Ap Parishad Election Results
Anand T
|

Updated on: Nov 07, 2026 | 12:38 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అధికారులు.. ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కూటమి పార్టీ అభ్యర్థులు పలు స్థానాల్లో విజయం సాధించారు. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో దూసుకుపోతున్నారు.

కడప జిల్లాలోని పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి 1,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం చాపిరి ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి హనుమంతు కైవసం చేసుకున్నారు. ఇక మార్కాపురం జిల్లాలోని వేములకోట ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మాదిరెడ్డి భారతి 32 ఓట్ల తేడాతో గెలుపొందగా.. నంద్యాల జిల్లాలోని మహానంది మండలం సీతారాంపురం ఎంపీటీసీ స్థానంలోనూ టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి నులి వెంకటేశ్వర్లుపై ఏకంగా 700 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

ఇక నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కృష్ణాపురం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ముడియాల రాజ ప్రతాప్ రెడ్డి 223 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు గన్నవరం మండలం అజ్జంపూడి ఎంపీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఈదులమూడి విజయ్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి అమృతల ప్రసాద్‌పై ఆయన విజయం సాధించారు.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా.. పలు ప్రాంతాల్లో ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తుండగా, అజ్జంపూడిలో వైసీపీ అభ్యర్థి గెలుపొందడం గమనార్హం. మిగిలిన స్థానాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us