AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2027 వేలంలో ఆ ఇద్దరే టార్గెట్.. సౌరవ్ గంగూలీ సంచలన ప్రకటన..!

IPL 2027 Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆ జట్టు ప్రధాన కోచ్ సౌరవ్ గంగూలీ కీలక విషయాన్ని వెల్లడించారు. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ షై హోప్‌లను తిరిగి జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఐపీఎల్ 2027 వేలంలో ఆ ఇద్దరే టార్గెట్.. సౌరవ్ గంగూలీ సంచలన ప్రకటన..!
Dc Sourav Ganguly
Venkata Chari
|

Updated on: Nov 07, 2026 | 12:30 PM

Share

IPL 2027 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్‌కు అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆటగాళ్ల ఎంపిక, జట్టు బలాబలాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తన వేలం వ్యూహంపై కీలక సంకేతాలు ఇచ్చింది. ఆ జట్టు నూతన ప్రధాన కోచ్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఇద్దరు విదేశీ ఆటగాళ్లపై ఆసక్తి కనబరుస్తున్నట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (Jake Fraser-McGurk), వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ షై హోప్ (Shai Hope)లను తిరిగి జట్టులోకి తీసుకోవాలని ఢిల్లీ యాజమాన్యం భావిస్తోంది. దీంతో రాబోయే మినీ వేలంలో ఈ ఇద్దరు ఆటగాళ్ల కోసం ఢిల్లీ పోటీ పడే అవకాశం ఉంది.

ఫ్రేజర్ మెక్‌గుర్క్‌పై ఢిల్లీ కన్ను..

ఆస్ట్రేలియాకు చెందిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇప్పటికే పరిచయమున్న ఆటగాడు. 2024 ఐపీఎల్‌లో లుంగి ఎంగిడి స్థానంలో రీప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చిన అతడు, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 2025 సీజన్‌కు ముందు ఢిల్లీ రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించి అతడిని తిరిగి జట్టులో కొనసాగించింది. ఇప్పటివరకు 15 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మెక్‌గుర్క్ 25.67 సగటుతో 385 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 199.49గా ఉంది. అందుకే మరోసారి ఈ ఆస్ట్రేలియా ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని ఢిల్లీ భావిస్తోంది.

షై హోప్‌కు మరో అవకాశం?

వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ షై హోప్ కూడా గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. 2024 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ అతడిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాతి సీజన్‌కు ముందు అతడిని విడుదల చేసింది. ఇప్పుడు మరోసారి హోప్‌ను జట్టులోకి తీసుకోవాలని గంగూలీ ఆసక్తి చూపిస్తున్నారు. వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగల సామర్థ్యం హోప్‌కు ఉండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం.

గంగూలీ ఏమన్నారంటే?

ఆనందబజార్ పత్రిక కథనం ప్రకారం, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. తమ దృష్టిలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉన్నారని, ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రేజర్ మెక్‌గుర్క్, వెస్టిండీస్‌కు చెందిన షై హోప్‌లను జట్టులోకి తీసుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

దీంతో ఐపీఎల్ 2027 మినీ వేలంలో ఈ ఇద్దరు ఆటగాళ్లపై ఆసక్తికరమైన పోటీ కనిపించే అవకాశం ఉంది. అయితే వీరి కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఎంతవరకు ఖర్చు చేస్తుందో వేలం జరిగే వరకు వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us