AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soundarya : సౌందర్య వాళ్ల ఇంట్లో ఆ సీన్ చూసి గుండె తరుక్కుపోయింది.. ఆ క్షణం ఇప్పటికీ బాధపెడుతుంది..

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని తన దివంగత స్నేహితురాలు సౌందర్యతో తనకున్న బంధాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. కన్నడ నేపథ్యం, సంగీతం వంటి ఉమ్మడి అభిరుచులతో వారి స్నేహం బలపడిందని తెలిపారు. సౌందర్య మరణం తనను ఎంతగా బాధించిందో వివరిస్తూ, ఆమె వివాహం, ఇంటికి వెళ్లిన సందర్భాలు, తండ్రి మరణం వంటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.

Soundarya : సౌందర్య వాళ్ల ఇంట్లో ఆ సీన్ చూసి గుండె తరుక్కుపోయింది.. ఆ క్షణం ఇప్పటికీ బాధపెడుతుంది..
Soundaya Home
Rajitha Chanti
|

Updated on: Nov 07, 2026 | 11:54 AM

Share

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని, దివంగత నటి సౌందర్యతో తనకున్న అపురూపమైన స్నేహం, మధుర జ్ఞాపకాలు, సౌందర్య మరణం పట్ల తన తీవ్ర దుఃఖాన్ని పంచుకున్నారు. సౌందర్యను తన బెస్ట్ ఫ్రెండ్, సొంత చెల్లెలిగా భావించే ఆమని, అలాంటి మంచి స్నేహితురాలు మళ్లీ దొరకదని అన్నారు. వారిద్దరూ అమ్మదొంగ, అన్నచెల్లెలు వంటి సుమారు మూడు, నాలుగు చిత్రాలలో కలిసి నటించారు. సినీ రంగం ద్వారానే వారి స్నేహం చిగురించింది. సౌందర్యతోనే అంత లోతైన బంధం ఎలా ఏర్పడిందనే ప్రశ్నకు ఆమని సమాధానమిస్తూ, ఇద్దరికీ కన్నడ నేపథ్యం ఉండటంతో మొదటి సినిమా నుంచే ఇద్దరూ బాగా కనెక్ట్ అయ్యారని తెలిపారు. సౌందర్య కన్నడ మాట్లాడితే తాను చాలా సంతోషించేదని, పాత కన్నడ పాటలపై తమ ఇద్దరికీ ఒకే రకమైన అభిరుచి ఉండటం స్నేహానికి బలమైన పునాది వేసిందని ఆమని వివరించారు. సౌందర్యలోని సాఫ్ట్, హోమ్లీ క్యారెక్టర్, తన వ్యక్తిగత విషయాలను పంచుకునే గుణం ఆమనిని మరింత ఆకట్టుకున్నాయి. తమ పర్సనల్ విషయాలను ఇద్దరూ స్వేచ్ఛగా షేర్ చేసుకునేవారని ఆమని చెప్పారు.

సౌందర్య జీవితంలో కీలక ఘట్టాలను ఆమని గుర్తు చేసుకున్నారు. సౌందర్య తండ్రి మరణించినప్పుడు, సౌందర్య తనను ప్రత్యేకంగా పిలిచి తన ఎదుట బోరున ఏడ్చిందని, తండ్రిని కుటుంబానికి ఒక స్తంభంగా భావించే సౌందర్య, ఆ స్తంభం కూలిపోయిందని ఎంతో బాధపడిందని ఆమని వివరించారు. ఈ సంఘటన తమ బంధాన్ని మరింత బలోపేతం చేసిందని అన్నారు. సౌందర్య తన వివాహం గురించి ఆమనితో ఫోన్‌లో చెప్పారని, పెళ్లికి వచ్చి ఒక రోజు పూర్తిగా అక్కడే ఉండి ఎంజాయ్ చేయమని కోరగా, ఆమని ఆ పిలుపును అందుకుని వివాహానికి హాజరయ్యారు. పెళ్లిలో సౌందర్య సోదరుడు అమర్‌తో కలిసి భోజనం చేసి, సరదాగా గడిపినట్లు ఆమని తెలిపారు. సౌందర్య వివాహానికి హాజరైన కొద్దిమంది ప్రముఖులలో ఆమని ఒకరు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

సౌందర్య మరణ వార్త సమయంలో తాను శ్రీ కళ్యాణ్ గారి స్వామి సినిమా షూటింగ్‌లో మీనాతో కలిసి ఉన్నానని, వార్త వినగానే ‘సౌందర్య గారు పోవడం ఏంటి?’ అని నమ్మలేకపోయానని, వెక్కి వెక్కి ఏడ్చానని చెప్పారు. మీనా కూడా బాధపడ్డారని, కానీ తనకెవరో సొంత వారు పోయినంత బాధ కలిగిందని, మీడియా ముందు కూడా ఏడ్చానని ఆమని ఆవేదన వ్యక్తం చేశారు. సౌందర్యను ఒక దేవతగా అభివర్ణించిన ఆమని, ఆమె మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు.ఒక సందర్భంలో సౌందర్య తండ్రి, ఆమనిని సౌందర్య సోదరుడు అమర్‌ను పెళ్లి చేసుకోమని సరదాగా అడిగారని, తాను సినీరంగంలో ఉన్నందున ఇది సాధ్యం కాదేమో అని ఆమని చెప్పగా, సౌందర్య కూడా సినిమాలో ఉంది కదా, ఇద్దరూ సినీ రంగంలో ఉంటే ఏమవుతుందని ఆయన ప్రశ్నించారని ఆమని గుర్తు చేసుకున్నారు. అయితే, తనకు ఆ ఆలోచన లేదని, అమర్ అప్పటికే ప్రేమలో ఉన్నాడని తర్వాత సౌందర్య తనకు చెప్పిందని ఆమని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

సౌందర్య మరణం తర్వాత వారి ఇంటికి వెళ్లినప్పుడు, పెద్ద హాల్‌లో సౌందర్య, ఆమె తండ్రి, సోదరుడు అమర్ చిత్రాలను చూసి గుండె తరుక్కుపోయిందని, సౌందర్య తల్లి ఒంటి రెక్కలా కూర్చుని ఉండటం చూసి చాలా బాధపడిందని ఆమని కన్నీరు పెట్టుకున్నారు. సౌందర్య తల్లి ఇప్పుడు అమర్ కుమారుడితో ఉంటుందని తెలిపారు. సౌందర్య సొంత సినిమా తీస్తున్నప్పుడు తోడుగా ఉండమని పిలిచినా తాను వెళ్ళలేకపోయానని, అది ఇప్పుడు తలుచుకుంటే చాలా బాధగా ఉందని ఆమని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us