Pragya Jaiswal: సల్మాన్‌ను మొదటిసారి కలిసినప్పుడు ఏం అడిగానంటే.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రగ్యా జైస్వాల్..

'కంచె' సినిమాలో 'సీతాదేవి' పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది ప్రగ్యాజైస్వాల్( Pragya Jaiswal). ఆతర్వాత 'ఓం నమో వేంకటేశాయ', 'నక్షత్రం', 'గుంటూరోడు' సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైంది.

Pragya Jaiswal: సల్మాన్‌ను మొదటిసారి కలిసినప్పుడు ఏం అడిగానంటే.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రగ్యా జైస్వాల్..
Follow us
Basha Shek

|

Updated on: Jan 24, 2022 | 3:40 PM

‘కంచె’ సినిమాలో ‘సీతాదేవి’ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది ప్రగ్యాజైస్వాల్( Pragya Jaiswal). ఆతర్వాత ‘ఓం నమో వేంకటేశాయ’, ‘నక్షత్రం’, ‘గుంటూరోడు’ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇటీవల బాలకృష్ణతో కలిసి ఆమె నటించిన ‘అఖండ’ (Akhanda) కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ బాలీవుడ్ సినిమాలోనూ నటించింది. అది కూడా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (salman khan) సరసన. ఆ సినిమానే ఇటీవల విడుదలైన ‘అంతిమ్’.  కానీ ఎందుకోగానీ సినిమాలో ఆమె సన్నివేశాలను తొలగించారు. ఎడిటింగ్ లో తీసేసినా సినిమాలోని సల్మాన్- ప్రగ్యా నటించిన ఓ రొమాంటిక్ సాంగ్ ను ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్రబృందం.ఇప్పటివరకు మిలియన్ల మంది ఈ పాటను వీక్షించారు. కాగా ఈ సినిమాలో సల్మాన్ తో కలిసి నటించడంపై తన అనుభవాలను పంచుకుంది ప్రగ్యా.

అలా అనుకోకూడదనే..

‘పాట షూటింగ్ జరిగిన రోజే సల్మాన్‌ని మొదటి సారి కలిశాను. అయితే ఆయనతో ఎలా వ్యవహరించాలో నాకు తెలియదు. సాధారణంగా సల్మాన్ లాంటి సూపర్ స్టార్లను మొదటి సారి కలిసేటప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.  తెలియకుండా మనం ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే వారికి కోపం రావచ్చు. అందుకే ఆయనను కలిసిన తొలి రోజే ‘మిమ్మల్ని ముట్టుకోవచ్చా’? అని అడిగాను. ఎందుకంటే మేం చేయబోయేది ఓ రొమాంటిక్ సాంగ్. అందుకే ఆయన ఏ మూడ్ లో ఉన్నారో ముందుగానే తెలుసుకోవాలనుకుని ఈ ప్రశ్న అడిగాను.  సినిమా షూటింగ్ లో ఎక్కువ చేస్తుంది కదా అని అనిపించుకోకుండా ఉండడమే నా అసలు ఉద్దేశం. నేను అలా అడగగానే  ‘ఏం పర్లేదు. నువ్వు నన్ను ముట్టుకోవచ్చు’ అని సర్ చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యాను. ఆ తర్వాత సాంగ్ షూట్ అంతా ఎంతో కంఫర్ట్‌గా సాగింది. పాట కూడా బాగా వచ్చింది’ అని తన అనుభవాలను చెప్పుకొచ్చింది ప్రగ్యా.

Also Read: Indian Army NT JAG Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఇండియన్ ఆర్మీలో ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలివే!

Coronavirus: కోలీవుడ్‌ ను వదలని కరోనా.. స్టార్‌ డైరెక్టర్‌ దంపతులకు పాజిటివ్‌..

Srikanth: శ్రీశైలం మల్లన్న సేవలో శ్రీకాంత్.. స్వామి వారిని ఏం కోరుకున్నారంటే..