Mrunal Thakur: డెంటల్ చదివిన ‘సీత’ యాక్టర్‌గా ఎలా మారింది.. అందు కోసం ఏం చేసింది.? మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. మొన్నటి వరకు ఎవరికీ తెలియని ఈ పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. మరాఠీ సినిమాల ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ అందాల తార తాజాగా..
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. మొన్నటి వరకు ఎవరికీ తెలియని ఈ పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. మరాఠీ సినిమాల ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ అందాల తార.. తాజాగా ‘సీతా రామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సీత పాత్రలో తనదైన నటన, అందంతో ప్రేక్షకులను మంగ్రముగ్ధుల్ని చేసింది. సీతారామం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందీ చిన్నది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూకడుతున్నాయి. మృణాల్‌కు స్టార్ హీరో సరసన నటించే అవకాశాలు వచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన వ్యక్తిగత జీవితం సినిమా కెరీర్‌లోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందన్న అంశాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నిజానికి నేను డెంటిస్ట్ కోర్స్ చేశాను. ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు కూడా వచ్చాయి. అయితే నాకు మాత్రం నటి కావాలనే కోరిక బలంగా ఉండేది. అందుకు అమ్మానాన్న ఒప్పుకునే వారు కాదు. ఈ క్రమంలోనే ఓరోజు వారికి ‘త్రీ ఇడియట్స్’ సినిమాను చూపించా. అందులో నచ్చిన పని చేయడంలో ఉన్న సంతోషం, నచ్చిన పనే చేయాలనే సందేశం వారికి నచ్చింది. సినిమా చూసిన తర్వాతే స్వయంగా అమ్మానాన్నే నన్ను ప్రోత్సహించారు. సినిమాల్లో ప్రయత్నించమని వెన్నంట నిలిచారు’ అని చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..