Maadhavi Latha: ‘మగాడిలా పోరాడుతున్నా.. కానీ’.. భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
టాలీవుడ్ ప్రముఖ నటి మాధవీ లత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటోంది.
టాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. సూటిగా మట్లాడేతత్వమున్న ఆమె సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతుంటుంది. అయితే ఈ మధ్యన ఒక రాజకీయ నాయకుడు మాధవీలత గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పాడు. అయితే తాజాగా మాధవీలత ఫుల్ ఎమోషనల్ అయ్యింది. తన ఆత్మగౌరవంపై దాడి జరిగిందంటూ భోరున ఏడ్చేసింది. ఈ క్రమంలో తన ఆవేదనకు గల కారణాన్ని సోషల్ మీడియా వేదికగా వివరించింది. ‘చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే.. ఇది నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి.. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన , దుఃఖం అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. కానీ, ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు. పదే పదే ఇవే మాటలన్నారు. ఎవరి వస్తారని ఎప్పుడూ ఆశపడలేదు. సమాజం కోసం నేను సైతం అనుకున్న.. నా పార్టీ ( ప్రజల) కోసం , మహిళల కోసం , హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. రూపాయి తీసుకున్నది లేదు ..ఎవరికి ద్రోహం చేసింది లేదు , మోసం చేసింది లేదు.. కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు.. ఆడపిల్లగా ఎపుడు నేను సింపతీ గేమ్ ఆడలేదు. మహిళలకు ఉన్నప్రత్యేక చట్టాలను ఉపయోగించింది లేదు. మగాడిలా పోరాడుతూనే ఉన్నాను . ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను. నాకు కుటుంబం , స్నేహితులు ఉన్న సరే నా అభిమానులు , సోషల్ మీడియా లో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు.. నా బాధని మీతో పంచుకున్నందుకు క్షమించండి.. మీ ప్రేమ అభిమానం , ఆశీర్వాదాలు నాకు శక్తిని ఇస్తాయి’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు మాధవీలత
కాగా తనపై కామెంట్స్ చేసిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారీ చెప్పడంపై మాధవీలత స్పందించింది. నోటికొచ్చినట్లు తిట్టి క్షమాపణలు చెబితే సరిపోతుందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మాధవీలత ఎమోషనలైంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీంతో సినీ అభిమానులు, నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
మాధవీలత ఎమోషనల్ వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి