AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన

ఈసారి సంక్రాంతి బరిలో మూడు సినిమాలు నిలిచాయి. అన్నీ స్టార్ హీరోల సినిమాలే. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతికి ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యాయి. కాగా ఏపీలో సినిమా టికెట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది.

Dil Raju: తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
Dil Raju
Basha Shek
|

Updated on: Jan 06, 2025 | 10:36 AM

Share

సంక్రాంతికి రిలీజయ్యే అన్ని సినిమాల టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులిచ్చింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్ తో పాటు వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా టికెట్ల ధరల పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలో ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఈ విషయంపై టీఎఫ్‌డీసీ ఛైర్మన్, దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో లాగే తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానన్నారు. ‌ ‘గేమ్ ఛేంజర్ పీ రిలీజ్ ఈవెంట్ అద్భుతమైన ఈవెంట్. మాకోసం టైం స్పెండ్ చేసి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఏపీ లో టికెట్ రేట్స్ పెంచినందుకు ఏపీ సీఎం డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కు ధన్యవాదాలు. గేమ్ చేంజెర్ ప్రత్యేకమైన సినిమా. మూడున్నర సంవత్సరాల గేమ్ ఛేంజర్ జర్నీ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసాను. సినిమా ఫీల్డ్ లో సక్సెస్ ఉంటేనే ఏదైనా చేయగలం. హీరో ఒక్కడి తప్పితే ఈ మూవీలో ఏముంది శంకర్ ఏమీ చేస్తాడులే అని అన్నారు. ఇవన్నీ కూడా నన్ను నేను మళ్లీ మార్చుకుని చేసిన సినిమా గేమ్ ఛేంజర్. ఇది నాకు కం బ్యాక్ సినిమా అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చూసి మెచ్చుకున్నారు. ప్రేక్షకులు కూడా వావ్ అనే రీతిలో గేమ్ ఛేంజర్ సినిమా ఉంటుంది .ఇందులో పాటల కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టాం. గేమ్ ఛేంజర్ తో పాటు సంక్రాంతి కి వస్తున్నాం సినిమా కూడా బాగా వచ్చింది. ఎఫ్‌2, ఎఫ్ 3 ఎలా ఎంజాయ్ చేసారో ఇది కూడా అలాగే ఉంటుంది’

నా వంతు ప్రయత్నం చేస్తా..

‘ నా సినిమాలు చూసి సంక్రాంతికి దిల్ రాజు కం బ్యాక్ అని జనాలు అంటారు . తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచమని సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను. ఆయన సానుకూలంగా స్పందిస్తారేమో చూడాలి. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి ఆయన కూడా ముందు చూపుతో ఉన్నారు. కాబట్టి నిర్మాత గా టికెట్ రేట్ల పెంపు కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను’ అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.

దిల్ రాజు ప్రెస్ మీట్.. వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు