Krithi Shetty: ఓవైపు సినిమాలు మరోవైపు కెరీర్‌… సైకాలజీ చదువుతుండడం వెనకా అసలు రీజన్‌ చెప్పిన కృతిశెట్టి..

Krithi Shetty: బాలీవుడ్‌లో వచ్చిన సూపర్ 30 చిత్రంతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన అందాల తార కృతిశెట్టి.. తెలుగులో ఉప్పెనతో ఒక్కసారిగా ఎగిసిపడింది. మొదటి సినిమాతోనే తన నటన, అందంతో ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ. అనతికాలంలోనే...

Krithi Shetty: ఓవైపు సినిమాలు మరోవైపు కెరీర్‌... సైకాలజీ చదువుతుండడం వెనకా అసలు రీజన్‌ చెప్పిన కృతిశెట్టి..
Krithi Shetty
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 19, 2022 | 7:00 AM

Krithi Shetty: బాలీవుడ్‌లో వచ్చిన సూపర్ 30 చిత్రంతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన అందాల తార కృతిశెట్టి.. తెలుగులో ఉప్పెనతో ఒక్కసారిగా ఎగిసిపడింది. మొదటి సినిమాతోనే తన నటన, అందంతో ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ. అనతికాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సినిమా విజయంలో కృతి కీలక పాత్ర పోషించింది. దీంతో కృతిశెట్టికి వరుసపెట్టి అవకాశాలు క్యూకట్టాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే బంగార్రాజు, ది వారియర్‌, మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాల్లో నటించిన ఈ చిన్నది తాజాగా నటించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్‌ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న కృతిశెట్టి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు కెరీర్‌ను కూడా కొనసాగిస్తున్నట్లు చెప్పుకొచ్చిన కృతి.. ప్రజెంట్‌ సైకాలజీ చదువుతున్నట్లు చెప్పుకొచ్చింది. దీని ద్వారా సినిమాలో పాత్రల్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది తెలుస్తుందని.. నటనలో హెల్ప్‌ అవుతుందని ఈ కోర్స్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఇక కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే నటనకు ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్రల్లోనూ నటించాలని ఉందని తెలిపిన కృతి.. ఈ విషయంలో తనకు శ్రీదేవీ స్ఫూర్తి అని చెప్పుకొచ్చింది.

అలాగే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో తన పాత్ర గురించి వివరిస్తూ.. ‘ఈ సినిమాలో నేను నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర చేశా. అందుకే ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్‌ అవుతున్నారు. చాలా మంది ఫోన్‌ చేసి ‘నన్ను నేను స్క్రీన్‌పై చూసుకున్నట్లుంది’ అని చెబుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఓ నటిగా ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది’ అని చెప్పుకొచ్చింది. ఇక కృతిశెట్టి ప్రస్తుతం వెంకట్‌ ప్రభుత దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న సినిమాతో పాటు.. సూర్య సరసన ఒక చిత్రంలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..