Bigg Boss 6 Telugu: ”అతను కన్నింగ్‌”.. ఎలిమినేషన్ తర్వాత అభినయ షాకింగ్ కామెంట్స్

మొదటి వారంలో ఎలిమినేషన్ లేకుండా ఎదోలా నెట్టుకొచ్చినా.. రెండో వారం లో మాత్రం డబుల్ ఎలిమినేషన్ తో షాక్ ఇచ్చారు బిగ్ బాస్. గత వారం ఏకంగా ఇద్దరినీ హౌస్ నుంచి బయటకు పంపించేశారు.

Bigg Boss 6 Telugu: ''అతను కన్నింగ్‌''.. ఎలిమినేషన్ తర్వాత అభినయ షాకింగ్ కామెంట్స్
Abhinaya Sri
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 19, 2022 | 7:08 AM

Bigg Boss 6 Telugu: మొదటి వారంలో ఎలిమినేషన్ లేకుండా ఎదోలా నెట్టుకొచ్చినా.. రెండో వారం లో మాత్రం డబుల్ ఎలిమినేషన్ తో షాక్ ఇచ్చారు బిగ్ బాస్. గత వారం ఏకంగా ఇద్దరినీ హౌస్ నుంచి బయటకు పంపించేశారు. వారాంతం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్ డబుల్ ఎనర్జీతో ఉంటుంది. శనివారం హౌస్ మేట్స్ కు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగార్జున. గేమ్ ఆడటానికి వచ్చారా..? లేక తినడానికి వచ్చారా అంటూ హౌస్ మేట్స్ ను పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు నాగార్జున. ఇక ఆదివారం రోజున మాత్రం సండే ఫన్ డే అంటూ హౌస్ మేట్స్ తో అతలాడించి ఎంటర్టైన్ చేసి ఫైనల్ గా ఒకరిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు నాగార్జున. శనివారం రోజున షానీ హౌస్ నుంచి అవుట్ అవ్వగా.. నిన్నటి ఎపిసోడ్ లో అభినయ శ్రీ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా సందడి చేసింది. బాబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా హౌస్ లో సందడి చేసింది. నాగార్జున పెట్టిన గజిబిజి గాన టాస్క్ లో హౌస్ మేట్స్ హుషారుగా పాటిస్స్పెట్ చేశారు. ఈ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ ను రెండు టీమ్స్ గా డివైడ్ చేశాడు నాగ్. ఇక ఈ టాస్క్ లో రేవంత్ టీమ్ విన్ అయ్యింది. అభినయ ఎలిమినేషన్, ఆ తరువాత ఆమె చేసిన కామెంట్లు ఇంట్రెస్టింగ్ మారాయి. నామినేషన్స్ లో ఆదిరెడ్డి, అభినయ చివరకు మిగిలారు. అబినయ ఎలిమినేట్ అయిందని నాగ్ చెప్పడంతో హౌస్ లో ఉన్నవారు కాస్త ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా సూర్య. ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ పైకి వచ్చిన అభినయ.. ఇంట్లో హానెస్ట్‌గా ఉన్న ఐదుగురు, హానెస్ట్‌గా లేని ఐదుగురి పేర్లు చెప్పమని అంటాడు. హానెస్ట్ లో ఫైమా, చంటి, శ్రీ సత్య, బాలాదిత్య, సూర్యల పేర్లు చెప్పింది అభినయ. అలాగే హానెస్ట్‌గా లేనివాళ్లలో రేవంత్ ఒక్కడి పేరే చెప్పింది అభినయ. ఆట మధ్యలో పర్సనల్ విషయాలు చెబుతాడు.. అది నాకు నచ్చలేదు.. నువ్ కన్నింగ్‌లా అనిపిస్తున్నావ్ అంటూ రేవంత్ గురించి చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.