Mahesh Babu: బాబు మొదలెట్టేశాడుగా..యాక్షన్ సీక్వెన్స్‌లో ఇరగదీస్తున్న సూపర్ స్టార్..
సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..
సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు పుష్కర కాలం తర్వాత మహేష్ గురూజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అతడు, ఖలేజా సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు సినిమా థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోకపోయినా.. టీవీల్లో మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమాలు వస్తా ఛానల్ మార్చకుండా చూసే జనాలు ఉన్నారు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ తో ఓ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. మహేష్ కెరీర్ లో 28వ మూవీగా వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది.
వెరీ రీసెంట్ గా మహేష్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ మొదలైంది. అయితే ఓ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ మూవీ షూటింగ్ ను మొదలు పెట్టారట త్రివిక్రమ్. విలన్ గ్యాంగ్ ను ఉతికిఆరేసే ఈ సన్నివేశంలో మహేశ్ బాబు ఇరగదీస్తున్నారని తెలుస్తోంది. మహేశ్ బాబుతో పాటు మరికొంత మంది ఈ సన్నివేశంలో పాల్గొంటున్నట్టుగా చెబుతున్నారు. ఈ ఫైట్ ను త్రివిక్రమ్ చాలా డిఫరెంట్ గా డిజన్ చేశారట. ఈ సినిమాలో మహేష్ సరసన పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ జంట గతంలో మహర్షి సినిమాలో నటించారు. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో పూజాహెగ్డే ఇప్పటికే అరవింద సమేత, అలవైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్స్ లో నటించింది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.