Kajal Aggarwal: తాను మిస్ చేసుకున్న చిత్రానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన కాజల్‌.. ఇంతకా ఆ సినిమా ఏంటనేగా..

Kajal Aggarwal: లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార కాజల్‌ అగర్వాల్‌ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ...

Kajal Aggarwal: తాను మిస్ చేసుకున్న చిత్రానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన కాజల్‌.. ఇంతకా ఆ సినిమా ఏంటనేగా..
Kajal Aggarwal
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 27, 2022 | 7:28 PM

Kajal Aggarwal: లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార కాజల్‌ అగర్వాల్‌ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ బిజీ హీరోయిన్లలో ఒకరిగా క్రేజ్‌ దక్కించుకుంది. కేవలం సౌత్‌కు మాత్రమే పరిమితం కాకుండా నార్త్‌లోనూ నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే 2020లో గౌతమ్‌ కిచ్లును పెళ్లి చేసుకున్న తర్వాత క్రమంగా సినిమాల్లో నటించడం తగ్గిస్తూ వచ్చిందీ బ్యూటీ. ఇక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పూర్తిగా సినిమాల నుంచి దూరంగా ఉంది. అప్పటికే షూటింగ్ ప్రారంభమైన కొన్ని చిత్రాలను సైతం కాజల్‌ వదులుకుంది.

ఇలా కాజల్‌ వదులుకున్న చిత్రాల్లో ‘ది ఘోస్ట్‌’ ఒకటి. నాగార్జున హీరోగా, ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తొలుత కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా జరిపారు. అయితే కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడం, తర్వాత కాజల్‌ గర్భం దాల్చడంతో సినిమా నుంచి తప్పుకుంది. దీంతో కాజల్‌ ప్లేస్‌ను సోనాల్‌ చౌహన్‌ రీప్లేస్‌ చేసింది. ఇలా ఘోస్ట్ చిత్రాన్ని కాజల్‌ కోల్పోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఘోస్ట్ చిత్రాన్ని అక్టోబర్‌ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ట్రైలర్‌తో పాటు ఈ విషయాన్ని తెలిపింది. ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ నేపథ్యంలో కాజల్‌ అగర్వాల్‌ ఘోస్ట్‌ చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ట్వీట్ చేసింది. తాను చేయాల్సిన సినిమాను చేయలేకపోయినా విషెస్‌ చెబుతూ ట్వీట్ చేయడం పట్ల ఆమె అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..