Ramya Krishna: ‘లైగర్’ మూవీ కోసం రమ్యకృష్ణ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో రమ్యకృష్ణ ఒకరు. ఈ బ్యూటీ తన నటనతో గ్లామర్ తో అప్పటి కుర్రకారును కట్టిపడేసింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది రమ్యకృష్ణ.

Ramya Krishna: 'లైగర్' మూవీ కోసం రమ్యకృష్ణ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!
Ramya Krishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 27, 2022 | 6:56 PM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో రమ్యకృష్ణ(Ramya Krishna) ఒకరు. ఈ బ్యూటీ తన నటనతో గ్లామర్ తో అప్పటి కుర్రకారును కట్టిపడేసింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది రమ్యకృష్ణ. కెరీర్ మంది స్వింగ్ లో ఉన్నప్పుడే స్టార్ దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకున్నారు రమ్య. ఆ తర్వాత మెల్లగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు రమ్యకృష్ణ. శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటన అద్భుతమనే చెప్పాలి. ఆ తర్వాత ఈ ఆముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా లైగర్ సినిమాలో నటించింది. ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్ కు తల్లిగా నటించారు రమ్యకృష్ణ.. ఫుల్ మాస్ మదర్ పాత్రలో అదరగొట్టారు రమ్యకృష్ణ. అయితే ఈ సినిమాకోసం రమ్యకృష్ణ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లైగర్ సినిమా కోసం రమ్య కృష్ణ భారీగా పారితోషకం అందుకున్నారట. లైగర్ సినిమా కోసం అచ్చంగా కోటి 50 లక్షలు అందుకున్నారట. అంటే ఓ హీరోయిన్ రెమ్యునరేషన్ అంత అమౌంట్ ఈ అమ్మడికి ఇచ్చారట. ఇక భారీ అంచనాల మధ్య లైగర్ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. లైగర్ లో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. అలాగే లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి