MLA Roja: పిల్లలు పుట్టరని చెప్పారు.. సంపాదించిందంతా అప్పులకే పోయింది. కంటతడి పెట్టుకున్న రోజా.
MLA Roja: రాజకీయం, సినిమా ఇలా రెండు రంగాల్లో తమదైన ముద్ర వేసిన అతి కొద్ది మంది మహిళల్లో రోజా ఒకరు. నటిగా వెండి తెరపై ఓ వెలుగు వెలిగారు రోజా. తెలుగులో దాదాపు...

MLA Roja: రాజకీయం, సినిమా ఇలా రెండు రంగాల్లో తమదైన ముద్ర వేసిన అతి కొద్ది మంది మహిళల్లో రోజా ఒకరు. నటిగా వెండి తెరపై ఓ వెలుగు వెలిగారు రోజా. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఓ వైపు ప్రజా సేవ చేస్తూనే మరోవైపు టీవీ షోల ద్వారా నిత్యం ప్రేక్షకులతో టచ్‌లో ఉంటున్నారు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రోజా జీవితంలోనూ చాలా కష్టాలు ఎదుర్కొన్నారని మీకు తెలుసా? తాను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను తెలుపుతూ ఇటీవల రోజా ఏడ్చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. వినాయక చవితి సందర్భంగా ‘ఊరిలో వినాయకుడు’ అనే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో ఎమోషనల్ అయిన రోజా.. ‘నేను 1991లో ఇండస్ట్రీకి వచ్చాను.. 2002 వరకు కష్టపడిన మొత్తం కూడా అప్పులే కట్టాను. పెళ్లి చేసుకునే ముందు నాకు సమస్యలు వచ్చాయి.. పిల్లలు పుట్టరు అని చెప్పారు. కానీ పెళ్లైన ఏడాదికే అన్షు పుట్టింది. అందుకే నాకు అన్షు అంటే చాలా ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాగా ఎమోషనల్ అయిన రోజా ఒక్కసారిగా ఏడ్చేశారు. దీంతో షోలో పాల్గొన్న వారి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ఇది చూసిన నెటిజన్లు.. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే రోజా జీవితంలోనూ ఇంతటి కష్టాలు ఉన్నాయని అనుకుంటున్నారు.
Also Read: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ మూవీ పోస్టర్స్..: Bheemla Nayak Posters.
Bigg Boss 5 Telugu: బిగ్బాస్ 5 షురూ.. హౌస్లోకి కంటెస్టెంట్స్.. ఫైనల్ లిస్ట్ ఇదే..