AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayakanth: విషమంగా స్టార్ హీరో ఆరోగ్యం.. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు..

ప్రస్తుత పరిస్థితులలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో గుర్తించడం కష్టంగా మారింది. అందులో మరీ ముఖ్యంగా చిత్రపరిశ్రమ

Vijayakanth: విషమంగా స్టార్ హీరో ఆరోగ్యం.. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు..
Vijaykanth
Rajitha Chanti
|

Updated on: Aug 31, 2021 | 10:01 AM

Share

ప్రస్తుత పరిస్థితులలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో గుర్తించడం కష్టంగా మారింది. అందులో మరీ ముఖ్యంగా చిత్రపరిశ్రమ. ఇటీవల ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు అనుహ్యంగా అనారోగ్యం భారిన పడుతున్నారు. తాజాగా డీఎండీకే అధ్యక్షుడు నటుడు విజయ్ కాంత్ గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. కొన్నాళ్లుగా విజయ్ కాంత్ ఆరోగ్యం బాగుండడం లేదు. దీంతో కొద్ది రోజుల క్రితం సింగపూర్, అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చారు. అయినా.. ఆయన ఆరోగ్య పరిస్థితులలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి, కోశాధికారి ప్రేమలతకు అప్పగించారు. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఆయన కోవిడ్ భారిన పడి కోలుకున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో సైతం విజయ్ కాంత్ ప్రసంగాలు చేయలేక చేతితో సైగలు చేస్తూ కనిపించారు. అప్పటి నుంచి విజయ్ కాంత్ ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఈనెల 25న తేదీన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. తాజాగా విజయ్ కాంత్ ఆరోగ్యం మరింత విషమంగా మారినట్లుగా సమాచారం. మాట్లాడే సామర్థ్యం, తానుగా లేచి నిలబడే శక్తిని కోల్పోయి బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం విజయ కాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్ తండ్రిని దుబాయ్ తీసుకెళ్లినట్లుగా సమాచారం. విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారినట్లుగా తెలుస్తోంది.

Also Read: తెలియకుండానే ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి.. బీపీ లెక్కలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు ఇవే.. ఇంత ఉంటే సాధారణమే అంటా..

Joe Biden: తాలిబన్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.. ఆఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాల తరలింపు తర్వాత జో బైడెన్‌.

Ranji Trophy 2021: ఒకే గ్రూపులో తలపడనున్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ టీంలు.. జనవరి 5 నుంచి పోరు షురూ..!