AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joe Biden: తాలిబన్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.. ఆఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాల తరలింపు తర్వాత జో బైడెన్‌.

Joe Biden: 20 ఏళ్లుగా ఆఫ్గనిస్తాన్‌లో ఉన్న అమెరికా బలగాలు సోమవారం అర్ధరాత్రి దాటక పూర్తిగా ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గత 17 రోజులుగా అమెరికా బలగాలు...

Joe Biden: తాలిబన్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.. ఆఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాల తరలింపు తర్వాత జో బైడెన్‌.
Joe Biden
Narender Vaitla
|

Updated on: Aug 31, 2021 | 11:23 AM

Share

Joe Biden: 20 ఏళ్లుగా ఆఫ్గనిస్తాన్‌లో ఉన్న అమెరికా బలగాలు సోమవారం అర్ధరాత్రి దాటక పూర్తిగా ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గత 17 రోజులుగా అమెరికా బలగాలు చేపట్టిన ప్రక్రియ నేటితో పూర్తయింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ ‘గత 17 రోజులుగా అఫ్గనిస్తాన్‌లో తమ బలగాలు చేపట్టిన పౌరుల తరలింపు ప్రక్రియ(ఎయిర్‌లిఫ్టు) అమెరికా చరిత్రలోనే అతి పెద్దది. సుమారు 1,20,000 వేల మంది అమెరికా పౌరులు, అమెరికా- అఫ్గన్‌ మిత్ర దేశాల ప్రజలను తరలించాము. 20 ఏళ్లుగా అమెరికా సైన్యం అఫ్గనిస్తాన్‌లో అందిస్తున్న సేవలు నేటితో ముగిశాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఆగష్టు 31, వేకువజాము లోపే.. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా.. అత్యంత సురక్షితంగా ఈ ప్రమాదకరమైన ఆపరేషన్‌ పూర్తి చేసిన మా కమాండర్లకు ధన్యవాదాలు చెబుతున్నాను. అయితే ఈ తరలింపు ప్రక్రియ ఇప్పటితో పూర్తైనట్లు కాదు, అంతర్జాతీయ భాగస్వాములు, మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇక తాలిబన్లు తామి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న బైడెన్‌.. అఫ్గనిస్తాన్‌ను వీడాలనుకున్న పౌరులను సురక్షితంగా తరలిస్తామని తాలిబన్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బైడెన్‌ గుర్తుచేశారు. అఫ్గనిస్తాన్‌ను వీడాలనుకుంటున్న అమెరికన్లు, అఫ్గన్‌, ఇతర విదేశీ పౌరులను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించానని తెలిపారు. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నేడు తీర్మానం జరుగనుందని బైడెన్‌ పేర్కొన్నారు. ఇక ఆగష్టు 31లోపు అమెరికా సైన్యాలను వెనక్కి పిలిపించడం వెనుక గల కారణాలను తదుపరి మీడియా సమావేశంలో వెల్లడిస్తానని బైడెన్‌ పేర్కొన్నారు.

Also Read: Tigers: పెద్ద పులుల గాండ్రింపులతో గుండెలదిరిపోతున్నాయి. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఒకటే భయం

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్‏లో కీలక మార్పులు.. కొత్తగా మరో ముగ్గురు..  

RTC Bus Wrecked: మానేరు వాగులో కొట్టకుపోయిన ఆర్టీసీ బస్సు.. అధికారుల అప్రమత్తంతో తప్పిన ప్రమాదం