Tigers: పెద్ద పులుల గాండ్రింపులతో గుండెలదిరిపోతున్నాయి. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఒకటే భయం

పెద్ద పులి.. ఇది ఎదురుపడక్కర్లేదు. దాని గాండ్రింపు చాలు గుండెలదిరిపోవడానికి. తెలంగాణలో రెండు జిల్లాల ప్రజలు ఇదే పరిస్థితిని

Tigers: పెద్ద పులుల గాండ్రింపులతో గుండెలదిరిపోతున్నాయి. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఒకటే భయం
Tiger Eating Grass
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 31, 2021 | 9:21 AM

Tigers Fear – Telangana: పెద్ద పులి.. ఇది ఎదురుపడక్కర్లేదు. దాని గాండ్రింపు చాలు గుండెలదిరిపోవడానికి. తెలంగాణలో రెండు జిల్లాల ప్రజలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పులి గాండ్రింపులతో మహబూబాబాద్, ములుగు జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. అడవుల్లో నుంచి జన సంచార ప్రాంతాల్లోకి వస్తోన్న పులులు ప్రజలను భయపెడుతున్నాయి. పదేపదే, పొలాల్లోకి, గ్రామ పరిసరాల్లోకి పులులు వస్తుండంతో జనం వణికిపోతున్నారు.

మహబూబాబాద్, ములుగు జిల్లాల ప్రజలను పులులు భయపెడుతున్నాయి. కొత్తగూడ, గంగారం మండలాల్లో సంచరిస్తోన్న పులులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయ్. పులి గాండ్రింపులతో ఏజెన్సీ గ్రామాలు హడలిపోతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి అటవీ ప్రాంతంలో పులి కదలికలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రెండు పశువులను పులి బలి తీసుకున్నాయి.

పశువుల కళేబరాలను గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. దాంతో, పులితోపాటు పులి పిల్ల ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్లు ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. పాదముద్రలను బట్టి రెండ్రోజుల క్రితమే పులి ఈ ప్రాంతంలో సంచరించనట్లు అంచనా వేశారు. దాంతో, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఫారెస్ట్ సిబ్బంది సూచించారు.

Read also: Car accident: లగ్జరీ ఆడి క్యూ కారు యాక్సిడెంట్.. 7 గురు స్పాట్ డెడ్.. విధ్వంసకర దృశ్యాలు