Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RTC Bus Wrecked: మానేరు వాగులో కొట్టకుపోయిన ఆర్టీసీ బస్సు.. అధికారుల అప్రమత్తంతో తప్పిన ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట శివారు మానేరు వాగులో నీటి ప్రవాహానికి ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది.

RTC Bus Wrecked: మానేరు వాగులో కొట్టకుపోయిన ఆర్టీసీ బస్సు.. అధికారుల అప్రమత్తంతో తప్పిన ప్రమాదం
Rtc Bus In Maneru
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 31, 2021 | 9:37 AM

Telangana RTC Bus Wrecked: తెలంగాణలో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట శివారు మానేరు వాగులో నీటి ప్రవాహానికి ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. సోమవారం సాయంత్రం వరదల్లో చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయంతో తీయడానికి ప్రయత్నించారు. కాగా వరద ఉధృతి పెరగడంతో మరుసటి రోజుకు ప్రయత్నాన్ని వాయిదా వేశారు. మంగళవారం ఉదయం నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు కొట్టుకుపోయింది.

ఇదిలావుంటే, సోమవారం సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి 25 మంది ప్రయాణికులతో గంభీరావుపేట మీదుగా సిద్దిపేటకు వెళ్తోంది. ఈ క్రమంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నర్మాల ఎగువ మానేరు మత్తడి దుంకడంతో లింగన్నపేట వద్ద మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శివారులోని లోలెవ‌ల్ బ్రిడ్జి మీదుగా వరద వెళ్తోంది. అయితే డ్రైవర్‌ గమనించకుండా బస్సును లోలెవ‌ల్ బ్రిడ్జి మీదుగా తీసుకెళ్లగా, నీటి ప్రవాహానికి బస్సు అదుపు తప్పింది. బ్రిడ్జి అంచున బ‌స్సు చిక్కుకుంది. స్థానికులు గమనించి ప్రయాణికులను తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు అంతా దిగిపోయాక బస్సును ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు చేశారు. జేసీబీ సాయంతో బయటకు తీస్తుండగా, ఒక్కసారి బస్సుకు కట్టిన తాళ్లు తెగిపోయాయి. దీంతో వరద ప్రవాహనికి బస్సు నీటిలో కొట్టుకుపోయింది.

Read Also… ‘సచిన్‌ లాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నావ్.. ముందుండి నడిపించడం కాదు.. మిగతా వారి నుంచి అత్యుత్తమ ఆటను రాబట్టండి’: కోహ్లీకి మాజీ కోచ్ సూచన

విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించింది చూసి..
విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించింది చూసి..
చాట్జీపీటీతో జర భద్రం..ఏఐలతో మనసు విప్పితే బతుకు బస్టాండే
చాట్జీపీటీతో జర భద్రం..ఏఐలతో మనసు విప్పితే బతుకు బస్టాండే
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌