Afghanistan Crisis: భారమైన హృదయంతో మాతృ భూమిని వదిలి పోతున్నాను.. ఆఫ్గాన్ ఫిలిమ్ మేకర్ ఎమోషనల్ పోస్ట్.
Afghanistan Crisis: అనుకున్నట్లే జరిగింది.. 20 ఏళ్ల పాటు తమ సహకారాన్ని అందించిన అమెరికా ఆఫ్గాన్ నుంచి పూర్తిగా వెనుదిరిగింది. అమెరికా రక్షణ దళాలతో కూడిన చివరి విమానం...
Afghanistan Crisis: అనుకున్నట్లే జరిగింది.. 20 ఏళ్ల పాటు తమ సహకారాన్ని అందించిన అమెరికా ఆఫ్గాన్ నుంచి పూర్తిగా వెనుదిరిగింది. అమెరికా రక్షణ దళాలతో కూడిన చివరి విమానం ఆఫ్గాన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బయలు దేరింది. అమెరికా దళాలు అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా ఖాళీ చేయడంతో తాలిబన్లు తుపాకులతో గాల్లోకి కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. దీంతో ఇన్నాళ్లు స్వేచ్ఛగా ఆఫ్గన్ ప్రజలు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు. తాలిబన్‌ల అరాచక పాలలను ఊహించుకొని ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళల పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించే తాలిబన్లతో తమకు ఎలాంటి హాని జరుగుతుందోనని భయపడుతున్నారు.
ఇక ఆఫ్గానిస్థాన్‌కు చెందిన కొందరు ప్రజలు ప్రాణాలను చేతులో పట్టుకొని ఇతర దేశాలకు పారిపోతున్నారు. బతికుంటే చాలని ఇంకేం వద్దంటూ సొంత ఊరును, వస్తువులను వదిలి ఖాళీ చేతులతో విమానాల్లో పారిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆఫ్గానిస్థాన్‌కు చెందిన ఓ ఫిలిమ్ మేకర్ చేసిన ట్వీట్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రోయా హైదరీ అనే మహిళ ఆఫ్గాన్‌కు చెందిన ఓ ఫిలిమ్ మేకర్, ఫొటోగ్రాఫర్ సొంత దేశౄన్ని వదిలేసి వెళ్లిపోతోన్న సమయంలో విమానాశ్రయంలో బిక్కుబిక్కుమంటూ ఉన్న సమయంలో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘నా జీవితాన్ని మొత్తం వదిలేసివెళ్లిపోతున్నాను. నా మాతృ భూమి నుంచి పారిపోతున్నాను. మళ్లీ నేను నా జీవితాన్ని మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంది. నేను నాతో పాటు కేవలం నా కెమెరాను, జీవం లేని నా ఆత్మను తీసుకొని సముద్రాలు దాటి వెళుతున్నాను. మళ్లీ కలుసుకునేంత వరకు నా మాతృభూమి నీకు గుడ్‌బై’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆఫ్గాన్ పౌరుల దీనావస్థకు ఈ ట్వీట్ అద్దం పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
I left my whole life, my home in order to continue to have a voice. Once again,I am running from my motherland. Once again, I am going to start from zero. I took only my cameras and a dead soul with me across an ocean. With a heavy heart, goodbye motherland. Until we meet again pic.twitter.com/MI3H8lQ5e4
— Roya Heydari (@heydari_roya) August 26, 2021
Also Read: Car accident: లగ్జరీ ఆడి క్యూ కారు యాక్సిడెంట్.. 7 గురు స్పాట్ డెడ్.. విధ్వంసకర దృశ్యాలు
Harassment: హైదరాబాద్‌లో దారుణం… తల్లితో సహజీవనం చేస్తూ.. కూతురిపై కన్నేసిన ప్రబుద్ధుడు.