AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harassment: హైదరాబాద్‌లో దారుణం… తల్లితో సహజీవనం చేస్తూ.. కూతురిపై కన్నేసిన ప్రబుద్ధుడు.

Harassment: హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లో దారుణం జరిగింది. ఓ ప్రబుద్ధుడు తల్లితో సహ జీవనం చేస్తూ.. కూతిరిపై లైంగిక దాడికి దిగిన ఘటన సమాజంలో విలువల పతనానికి..

Harassment: హైదరాబాద్‌లో దారుణం... తల్లితో సహజీవనం చేస్తూ.. కూతురిపై కన్నేసిన ప్రబుద్ధుడు.
Harassment
Narender Vaitla
| Edited By: uppula Raju|

Updated on: Aug 31, 2021 | 2:26 PM

Share

Harassment: హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లో దారుణం జరిగింది. ఓ ప్రబుద్ధుడు తల్లితో సహ జీవనం చేస్తూ.. కూతిరిపై లైంగిక దాడికి దిగిన ఘటన సమాజంలో విలువల పతనానికి పరాకాష్టగా మారింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఓ మహిళకు 15 ఏళ్ల కూతురు, 17 ఏళ్ల కుమారుడు ఉన్నారు. అయితే కుటుంబంలో గొడవలు జరగడంతో భర్తను వదిలేసిన మహిళ పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. ఈ సమయంలో ఆమెకు స్థానికంగా సెంట్రింగ్‌ పనిచేసే బేతమాల కృష్ణ (35) అనే వ్యక్తితో పరిచయం ఏర్పండింది.

ఆ పరిచయం కాలక్రమేణా వైవాహిక బంధానికి దారి తీసింది. పిల్లలకు తండ్రి స్థానంలో ఉంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత.. కొద్ది రోజుల క్రితం పనికోసం హైదరాబాద్‌ చేరుకున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14 సమీపంలో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే బోనాల పండుగకు మెట్టుగూడలో ఉన్న తల్లి ఇంటికి ఆ మహిళ తన కూతురుని పంపించింది.

అయితే అమ్మమ్మ వాళ్ల ఇంటి నుంచి వచ్చిన తర్వాత కూతురు దిగాలుగా ఉండడంతో అనుమానం వచ్చిన మహిళ ఏం జరిగిందని ఆరా తీసింది. దీంతో కూతురు చెప్పిన విషయం విని ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఈ నెల 7వ తేదీని ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కుమార్తె తల్లికి వివరించింది. దీంతో ఆమె ఒక్కసారి కృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆదివారం రాత్రి బంజారహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ మేరకు నిందితిడుపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Also Read: Smuggling: ఇది పెయింట్ అనుకున్నారో పప్పులో కాలేసినట్లే.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు ఔటే..!

Tollywood: డ్రగ్స్‌ కొనేందుకు సెలబ్రిటీలు డబ్బు ఎలా చెల్లించారు? డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌తో విచారణ మళ్లీ మొదలు

Loan Apps Case: లోన్ యాప్స్ కేసులో ఆ బ్యాంకు మేనేజర్‌ అరెస్టు.. ఈ కంత్రీగాడి కన్నింగ్ పని ఏంటంటే

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ