AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. గాడ్ ఫాదర్‏లో కీలక పాత్రలో ఆ స్టార్ హీరోయిన్..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లూసిఫర్ చిత్రానికి తెలుగు

Megastar Chiranjeevi: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. గాడ్ ఫాదర్‏లో కీలక పాత్రలో ఆ స్టార్ హీరోయిన్..
Chiru
Rajitha Chanti
|

Updated on: Aug 31, 2021 | 11:20 AM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్‏గా గాడ్ ఫాదర్ రూపొందుతుంది. ఇటివలే ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది చిత్రయూనిట్. మలయాళ లూసీఫర్ మూవీలో మెగాస్టార్ ఇమేజ్‏కి ఎంత మాత్రం తగ్గకుండా గాడ్ ఫాదర్ మలుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం పలువురు స్టార్లను రంగంలోకి దించుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించి గాసిప్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా టాక్ వినిపించింది. చిరు, సల్మాన్ మధ్య ఉండే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయిని.. ఈ సినిమాతో తెలుగులో సల్మాన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ బయటకు వచ్చింది.

ఇందులో మరో కీలక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలి పాత్రలో విద్యాబాలన్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మలయాళంలో ఈ రోల్లో మంజువారియర్ నటించగా… తెలుగులో విద్యాబాలన్ నటించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. తన తండ్రిని తనకు దూరం చేస్తున్నాడని చిన్నప్పటినుంచే హీరోపై అతని చెల్లి ద్వేషం పెంచుకుంటుంది. చివరికి ఆ ద్వేషాన్ని హీరో ఎలా పోగోట్టుకుంటాడనేది ఇందులో చూపించబోతున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ-సూపర్ గుడ్ ఫిలిమ్స్- ఎన్వీఆర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Vidya Balan

Vidya Balan

ఇప్పటికే చిరు నటించిన ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇందులో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటించగా.. రామ్ చరణ్, కీర్తి సురేష్ కీలక పాత్రలలో నటించారు.

Also Read: Varudu Kaavalenu: టామ్‌ అండ్‌ జెర్రీలా ఉన్న వీరు ప్రేమలో ఎలా పడ్డారబ్బా.? ఆకట్టుకుంటోన్న వరుడు కావలెను టీజర్‌.

Preity Zinta: ప్రీతి జింటా జిమ్ వర్కౌట్స్ వీడియో.. మీ అందం వెనుక సీక్రెట్ తెలిసిపోయిందంటున్న ఫ్యాన్స్

Vijayakanth: విషమంగా స్టార్ హీరో ఆరోగ్యం.. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు..