AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Preity Zinta: ప్రీతి జింటా జిమ్ వర్కౌట్స్ వీడియో.. మీ అందం వెనుక సీక్రెట్ తెలిసిపోయిందంటున్న ఫ్యాన్స్

బాలీవుడ్, టాలీవుడ్ సినీ తారలు తమ ఫిట్‌నెస్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పైకి నాజుగ్గా కనిపించే వారి అందాల వెనుక ఇంత శ్రమ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Preity Zinta: ప్రీతి జింటా జిమ్ వర్కౌట్స్ వీడియో.. మీ అందం వెనుక సీక్రెట్ తెలిసిపోయిందంటున్న ఫ్యాన్స్
Preity Zinta Zym Workout
Janardhan Veluru
|

Updated on: Aug 31, 2021 | 10:47 AM

Share

Preity Zinta’s Workout Video: బాలీవుడ్, టాలీవుడ్ సినీ తారలు తమ ఫిట్‌నెస్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పైకి నాజుగ్గా కనిపించే వారి అందాల వెనుక ఎంతో శ్రమ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం.. అవసరమైతే ఓ పూట తిండి తినకపోవడంతో పాటు నిత్యం గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుంటారు. చీట్ డే నాడు కాస్త ఎక్కువ లాగించినా.. మరుసటి రోజు ఆ మేరకు వర్కౌట్స్ ఎక్కువ చేస్తున్నారు. అలా అందం, ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే సెలబ్రిటీస్ తమ వర్కౌట్స్‌ వీడియోలను సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తూ తమ ఫ్యాన్స్, నెటిజన్స్‌ను కూడా నిత్యం వ్యాయామం చేసేలా మోటివేట్ చేస్తుంటారు. తాజాగా సినీ నటి ప్రీతి జింటా తన జిమ్ వర్కౌట్స్‌ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్ ఇన్‌స్ట్రుమెంట్‌ మీద ప్రీతి జింటా ఫుల్ బాడీ వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఇది.

ప్రీతి జింటా ఫిట్‌నెస్ కోసం ఎంతో శ్రమిస్తున్నారంటూ ఆమె ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు మీ అందం వెనుక సీక్రెట్ ఇదేనన్న మాట అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం నాలుగు పదుల వయస్సులోనూ మీ అందం తగ్గలేదంటూ సెటైరికల్‌గా ప్రశంసలు తెలియజేస్తున్నారు.

ప్రీతి జింటా జిమ్ వర్కౌట్ వీడియో..

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz)

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెల్రబిటీల్లో ప్రీతి జింతా కూడా ఒకరు. నిత్యం తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో కనెక్టై ఉంటారు. ప్రీతి జింటాకు ఇన్‌స్టాగ్రమ్‌లో 84 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారం క్రితం యాపిల్ తోటలో ప్రితా జింటా సందడి చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇది కూడా వైరల్ అయ్యింది. దీనికి దాదాపు 51 లక్షల లైక్స్ వచ్చాయంటే సొట్టబుగ్గల సుందరికి సోషల్ మీడియాలో క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz)

ప్రీతి జింటా హిందీతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటించారు. 1998లో దిల్ సే సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రీతి.. ఈ సినిమాకు ఉత్తమ నటి(డెబ్యూ)గా ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నారు. ప్రీతీ తెలుగులో వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా(1998), మహేష్ బాబు సరసన రాజకుమారుడు(1999) సినిమాల్లో నటించారు. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో 1975 జనవరి 31న ప్రీతి జన్మించింది. ఆమె తండ్రి సైన్యంలో అధికారికా పనిచేశారు. ప్రీతీ 13 ఏళ్లప్పుడు ఆమె తండ్రి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు.

Also Read..

Jacqueline Fernandez: డ్రగ్స్, మనీలాండరింగ్ కేసు.. స్టార్ హీరోయిన్‏కు చెమటలు పట్టించిన ఈడీ..

Krishnashtami 2021: కృష్ణాష్టమి సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పిన మహేష్, పూజా హెడ్గే, కాజల్, రకుల్

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!