- Telugu News Photo Gallery Cinema photos Enforcement Directorate Officers Interrogates Jacqueline Fernandez in Money Laundering Case
Jacqueline Fernandez: డ్రగ్స్, మనీలాండరింగ్ కేసు.. స్టార్ హీరోయిన్‌కు చెమటలు పట్టించిన ఈడీ..
గత కొద్దిరోజులుగా చిత్రపరిశ్రమలోని ప్రముఖుల చుట్టూ వివిధ కేసులు తిరుగుతున్నాయి. డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులతో సెలబ్రెటీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
Updated on: Aug 31, 2021 | 6:52 AM

గత కొద్దిరోజులుగా చిత్రపరిశ్రమలోని ప్రముఖుల చుట్టూ వివిధ కేసులు తిరుగుతున్నాయి. డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులతో సెలబ్రెటీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారిస్తోంది.

ఇటు తెలుగు ఇండస్ట్రీలోని పలువురు తారలను సెప్టెంబర్ నెలలో డ్రగ్స్ కేసులో భాగంగా విచారించనున్నట్లుగా ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్లో సైతం మనీలాండరింగ్ కేసులో భాగంగా తారలను విచారించే పనిలో పడింది ఈడీ.

ఇటు తెలుగు ఇండస్ట్రీలోని పలువురు తారలను సెప్టెంబర్ నెలలో డ్రగ్స్ కేసులో భాగంగా విచారించనున్నట్లుగా ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్లో సైతం మనీలాండరింగ్ కేసులో భాగంగా తారలను విచారించే పనిలో పడింది ఈడీ.

మానీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) అధికారులు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను దాదాపు ఐదు గంటలుగా విచారించారు. మనీలాండరింగ్ ఆరోపణలతోనే జాక్వెలిన్‌ను ఈడీ విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక మరోవైపు ముంబయిలోని ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లిని ఎన్‌సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను సెప్టెంబర్ 1 వరకు ఎన్‌సీబీ కస్టడీలోకి తీసుకుంది.

ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 4 సంవత్సరాల క్రితం డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి మరియు దర్శకుడు పూరి జగన్నాధ్‌తో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.




