AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishikanth: సుకుమార్, రామ్ చరణ్ సినిమాలో డోరతి హీరో.. మూవీ లాంచ్ ఈవెంట్ పై క్లారిటీ..

యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి, సహాయక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు రిషికాంత్. ఇటీవలే 'మొద రాత్రి' చిత్రంతో హీరోగా వెండితెరపైకి అడుగుపెట్టారు. రజినీకాంత్ 'కూలీ', కీర్తి సురేష్ 'డొరోథి' వంటి ప్రముఖ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ, క్రమంగా కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అయితే ఇటీవల రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ లాంచ్ ఈవెంట్ లో సందడి చేశాడు.

Rishikanth: సుకుమార్, రామ్ చరణ్ సినిమాలో డోరతి హీరో.. మూవీ లాంచ్ ఈవెంట్ పై క్లారిటీ..
Rc 17, Rishikanth
Rajitha Chanti
|

Updated on: Nov 10, 2026 | 3:29 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘RC17’ (వర్కిగ్ టైటిల్). రంగస్థలం తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా రాగా.. హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా తమిళ యువ నటుడు రిషికాంత్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో లేదా విలన్‌గా నటిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పూజా కార్యక్రమానికి రిషికాంత్ ప్రత్యేక అతిథిగా హాజరుకావడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించిన నటుడు రిషికాంత్ స్పందించి అన్ని ఊహాగామాలకు చెక్ పెట్టారు. తాను రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో నటించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తాను హీరోగా ‘మొదరాత్రి’ చిత్రంలో నటించానని, ఆ సంస్థతో ఉన్న అనుబంధం కారణంగానే మైత్రి వాళ్లు ఆహ్వానిస్తేనే ఈ మూవీ పూజా కార్యక్రమానికి వెళ్లానని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..

సినిమా విడుదలైన తర్వాత తాను అందులో లేనని తెలిసి ప్రేక్షకులు, అభిమానులు నిరాశ చెందడం కంటే ముందే ఈ విషయాన్ని తానే స్వయంగా స్పష్టం చేయాలనుకున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని సమాచారం. త్వరలోనే చిత్ర యూనిట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన యువ నటుడు రిషికాంత్ కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో ప్రయాణాన్ని ప్రారంభించి, ప్రస్తుతం హీరోగానూ, గుర్తింపు పొందిన పాత్రల్లోనూ నటిస్తున్నారు. నటుడిగా దాదాపు 15 ఏళ్ల పోరాటం తర్వాత రిషికాంత్ హీరోగా నటించిన తొలి తమిళ చిత్రం మొదరాత్రి. రాజా కరుప్పుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ కామేడీ డ్రామాలో అనీష్మా అనిల్ కుమార్ హీరోయిన్‌గా నటించారు. బాక్సాఫీస్ వద్ద మంచి ప్రశంసలు పొందిన ఈ సినిమాను ధనుష్, శింబు వంటి ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇక ఇటీవల కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన డోరతి చిత్రంలో కీలకపాత్ర పోషించారు రిషికాంత్. ఈ చిత్రం టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us