AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో నిజంగా దేవుడు.. సాయం కావాలని కోరితే వెంటనే స్పందించే వ్యక్తి ఆయన

ఓ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు బాబీ, దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. శ్రీహరితో తనకున్న అనుబంధాన్ని, ఆయన మానవతా దృక్పథాన్ని బాబీ గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన ఓ సంఘటన గురించి వివరిస్తూ..

ఆ హీరో నిజంగా దేవుడు.. సాయం కావాలని కోరితే వెంటనే స్పందించే వ్యక్తి ఆయన
Bobby
Rajeev Rayala
|

Updated on: Nov 10, 2026 | 1:09 PM

Share

దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. “జనరల్‌గా ఒక సామెత ఉంటది. దేవుడు అన్ని చోట్ల ఉండడు, అమ్మ రూపంలో ఉంటాడని. నాకు నేను గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు మా అమ్మ గుంటూరులో ఉండేది. నాకు శ్రీహరి గారిలో దేవుడు కనపడేవాడు” అని బాబీ భావోద్వేగంగా చెప్పారు. ఇది తన ఒక్కరి విషయంలోనే కాదని, చాలా మందికి శ్రీహరి గారు దేవుడిలా కనిపించేవారని ఆయన స్పష్టం చేశారు. సి. కళ్యాణ్ గారు గతంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, “ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కొన్ని లక్షల మంది జనం వస్తే, వాళ్ళందరూ ఆయన్ని చూడటానికి రావటం ఒకటే కాదు, ప్రతి ఒక్కళ్ళకి, వచ్చిన లక్షల మందిలో ప్రతి ఒక్కళ్ళకి ఆయన సహాయపడి ఉంటాడు. కచ్చితంగా.” అని బాబీ శ్రీహరి దయాగుణాన్ని కొనియాడారు.

శ్రీహరి వ్యక్తిత్వాన్ని, సహాయ స్వభావాన్ని తెలియజేసేందుకు బాబీ ఒక ఆసక్తికరమైన సంఘటనను వివరించారు. “జనరల్‌గా శ్రీహరి గారికి రెండు మొబైల్స్ ఉంటాయి. ఒక పర్సనల్ నంబర్, ఒకటి పబ్లిక్ నంబర్. పర్సనల్ నంబర్ ఫ్యామిలీ వాళ్ల దగ్గర ఉంటుంది కాబట్టి నైట్ ఆఫ్ చేస్తారు. పబ్లిక్ ఏది ఇస్తారో అది ఆన్ లో పెట్టేవారు వైబ్రేషన్ లో” అని బాబీ తెలిపారు. ఒక రాత్రి 12:30, 1:00 గంటల సమయంలో, శ్రీహరి గారి పబ్లిక్ నంబర్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. శిరిడీ నుంచి బస్సులో హైదరాబాద్ వస్తున్న ఒక కుటుంబం ( భార్య, భర్త, ఇద్దరు ఆడపిల్లలు) తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఫోన్ చేసిన వ్యక్తి ఏడుస్తూ ఏదో మాట్లాడుతున్నాడని బాబీ వివరించారు. శ్రీహరి గారు ఆ వ్యక్తిని ప్రశాంతంగా ఉండమని, సరిగ్గా ఏం జరిగిందో చెప్పమని అడిగారు.

ఆ వ్యక్తి చెప్పిన సమస్య ఏంటంటే: శిరిడీ నుంచి వస్తుండగా బస్సులో ఐదుగురు వ్యక్తులు మద్యం తాగి ఎక్కారు. వారు ఆ కుటుంబంలోని భార్యను, ఆడపిల్లలను చూసి అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు. దీనితో కోపం వచ్చిన ఆ వ్యక్తి వారిని తిట్టాడు. ఆ మందుబాబులు బస్సులో చాలా మంది ఉన్నారని, హైదరాబాద్‌లోని సనత్ నగర్ రాగానే అతన్ని కొడతామని బెదిరించారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక, ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాక, ఆ వ్యక్తి ఎవరికో నంబర్ ఇస్తుండగా దూరం నుంచి చూసి సేవ్ చేసుకున్న శ్రీహరి గారి నంబర్‌కు డైరెక్ట్‌గా ఫోన్ చేసి తన సమస్యను వివరించాడు. ఈ సంఘటన శ్రీహరి గారు ఎంతటి అందుబాటులో ఉండే వ్యక్తి, ఆపదలో ఉన్న వారికి ఎలా అండగా నిలిచేవారో తెలియజేస్తుంది. శ్రీహరి గారు వెంటనే స్పందించి.. నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఫోన్ పెట్టాశారు.. కట్ చేస్తే ఉదయం బస్సు ఎస్స్ ఎస్.ఆర్ నగర్ రాగానే.. శ్రీహరి గారు కారులో వచ్చి అక్కడ ఎదురుచూస్తున్నారు. నిద్ర ముఖంతో, లుంగీ మీద వచ్చి అక్కడ ఎదురుచూశారు శ్రీహరి. అంటే మనం అర్ధం చేసుకోవచ్చు.. సాయం కావలి అంటే శ్రీహరి ఎలా స్పందిస్తారో.. ఆయనలోని దైవత్వానికి ఇది ఒక నిదర్శనమని బాబీ ప్రసంగంలో వెల్లడించారు. ఈ సంఘటన ద్వారా శ్రీహరి గారు కేవలం ఒక నటుడుగానే కాకుండా, నిజమైన మానవతావాదిగా, అనేక మందికి ఆపద్బంధువుగా నిలిచారని బాబీ తెలిపారు.

Srihari

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us