Kalki 2898 AD: కల్కి సినిమా కాన్సెప్ట్ చెప్పేసిన కమల్.. ఇంతకీ సినిమాలో లోకనాయకుడి పాత్ర ఏంటో తెలుసా?
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'కల్కి 2898 AD'. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చూపు ఉంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌తో పాటు, దీపికా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక లోక నాయకుడు కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో...

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘కల్కి 2898 AD’. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చూపు ఉంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌తో పాటు, దీపికా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక లోక నాయకుడు కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచేసింది.
అమెరికాలోని శాండియాగో కామిన్‌కాన్ ఈవెంట్‌లో ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ ‘కల్కి’ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ హలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ.. పురాణాలను, భవిష్యత్తును కలబోసి నాగ్‌అశ్విన్ గొప్ప కథను తయారు చేశాడన్నారు. మనందరం వేల సంవత్సరాలుగా పురాణాలను అనుసరిస్తున్నామన్న కమల్.. వాటి గొప్పతనాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమాలో తాను నటిస్తానని ఎవరూ ఊహించలేదన్న కమల్ హాసన్.. ప్రభాస్ సైతం తనతో ఇదే విషయాన్ని అన్నారన్నారు. ఈ సినిమాలో తనను ఎలా ఒప్పించారనేది ఆశ్చర్యంగా ఉందంటూ ప్రభాస్ అన్నారని కమల్ తెలిపారు. అయితే పురాణాల గొప్పతనాన్ని ఈ తరాణానికి చెప్పిన విధానం నచ్చే తాను విలన్ రోల్‌లో నటించేందుకు ఒప్పుకున్నట్లు కమల్ చెప్పుకొచ్చారు.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




