AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bro: భారీ అంచనాలతో రిలీజ్ అవుతోన్న ‘బ్రో’.. పవన్ మేనియా షురూ !!

మరికొద్ది సేపట్లో బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌ కోసం శిల్ప కళావేదిక గ్రాండ్‌గా రెడీ అయ్యింది. అభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతారన్న వార్తల నేపథ్యంలో అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

Phani CH
|

Updated on: Jul 25, 2023 | 4:51 PM

Share
గెట్ రెడీ ఫ్యాన్స్‌: మరికొద్ది సేపట్లో బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌ కోసం శిల్ప కళావేదిక గ్రాండ్‌గా రెడీ అయ్యింది. అభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతారన్న వార్తల నేపథ్యంలో అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి సారి పవన్ కల్యాణ్ సాయి ధరమ్ తేజ్‌ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఈవెంట్‌ టీవీ 9లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం కానుంది.

1 / 5
అభిమానుల సందడి: శిల్ప కళావేదికకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకుంటున్నారు. పాసులు ఉన్నవారిని మాత్రమే ఈవెంట్ హాల్‌లోకి ఎలో చేస్తున్నారు. బయట కూడా భారీ స్థాయిలో అభిమానులు కనిపిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచే శిల్పకళా వేదిక దగ్గర అభిమానులు సందడి కనిపిస్తోంది. మరికాసేపట్లో చిత్రయూనిట్ వేదిక వద్దకు రానున్నారు.

2 / 5
రెయిన్ ఎఫెక్ట్‌: పవన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఓపెన్‌ గ్రౌండ్‌లో భారీగా నిర్వహించే ఉంటే అదే స్థాయిలో అభిమానులకు అవకాశం ఉండేది. కానీ వర్షాల కారణంగా ఇండోర్‌లో ఈవెంట్‌ నిర్వహిస్తుండటంతో తక్కువ సంఖ్యలో అభిమానులకు ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. దీంతో వేదిక దగ్గర అభిమానులు హడావిడి కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది.

3 / 5
బ్రోకి క్లీన్ యు: ఇప్పటికే బ్రో సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఎమోషన్స్‌, కామెడీ పక్కాగా ఉన్న ఫ్యామిలీ డ్రామా కావటంతో ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్‌ను జారీ చేసింది సెన్సార్ బోర్డ్‌. పవన్‌ కల్యాణ్ కాలదేవుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

4 / 5
తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా: తమిళ సూపర్ హిట్ వినోదయ సిత్తమ్‌కు రీమేక్‌గా తెరకెక్కింది బ్రో. డిజిటల్‌లో రిలీజ్ అయిన వినోదయ సిత్తమ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సముద్రఖని కీలక పాత్రలో నటించటంతో పాటు స్వయంగా దర్శకత్వం వహించారు. ఇప్పుడు అదే కథను పవన్‌ ఇమేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ ఏజ్‌కు తగ్గట్టుగా మార్పులు చేసి తెలుగులో రీమేక్ చేశారు.

5 / 5