AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

kajal aggarwal: భయపెట్టేందుకు సిద్ధమైన అందాల చందమామ.. ఆ హార్రర్‌ సీక్వెల్‌లో కాజల్‌.?

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న కాజల్ మళ్లీ సినిమాలతో బిజీగా మారుతోంది. అందులో భాగంగానే వర్కవుట్స్‌తో మళ్లీ ఫిట్‌నెస్‌ను పెంచుకునే పనిలో పడిందీ బ్యూటీ. ఈ క్రమంలోనే కాజల్‌ ప్రస్తుతం ఇండియన్‌ 2 సినిమాలో నటిస్తోన్న...

kajal aggarwal: భయపెట్టేందుకు సిద్ధమైన అందాల చందమామ.. ఆ హార్రర్‌ సీక్వెల్‌లో కాజల్‌.?
Kajal Aggarwal
Narender Vaitla
|

Updated on: Oct 14, 2022 | 8:59 AM

Share

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న కాజల్ మళ్లీ సినిమాలతో బిజీగా మారుతోంది. అందులో భాగంగానే వర్కవుట్స్‌తో మళ్లీ ఫిట్‌నెస్‌ను పెంచుకునే పనిలో పడిందీ బ్యూటీ. ఈ క్రమంలోనే కాజల్‌ ప్రస్తుతం ఇండియన్‌ 2 సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. నిజానికి కాజల్‌ ఆచార్య చిత్రంలో కనిపించాల్సి ఉండగా, తల్లి కాబోతున్న వార్త తెలియడంతో సినిమా నుంచి మధ్యలోనే తప్పుకుంది. దీంతో కాజల్‌ పాత్రను పూర్తిగా తొలగించడంతో పాటు అసలు హీరోయిన్‌ క్యారెక్టర్‌ను తొలగించారు.

ఇక తన కెరీర్‌ను మళ్లీ రీస్టార్‌ చేస్తున్న కాజల్‌కు ఇప్పుడు కూడా ఆఫర్లు క్యూకడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాజల్‌ కొత్తగా ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. 2005లో పి. వాసు దర్శత్వంలో వచ్చిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ను తీసుకోవడానికి చిత్రయూనిట్‌ మొగ్గు చూపినట్లు సమచారం. కాజల్‌ ఇప్పటికే ఈ సినిమా కోసం సంతకం కూడా చేసిటన్లు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రానుంది.

ఇదిలా ఉంటే చంద్రముఖి సీక్వెల్‌లో లారెన్స్‌ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. గతకొన్ని రోజుల క్రితమే చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సీక్వెల్‌కు కూడా పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకాగా, త్వరలోనే కాజల్‌ షూటింగ్‌లో పాల్గొననుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ కొత్త ఈవీ స్కూటర్
మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ కొత్త ఈవీ స్కూటర్
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..