AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara Movie: బాక్సాఫీస్ వద్ద నయా రికార్డ్ సృష్టించిన కాంతార మూవీ.. ఏకంగా కేజీఎఫ్ 2 చిత్రాన్ని వెనక్కు నెట్టిన రిషబ్ శెట్టి..

ఈ మూవీ తెలుగు వెర్షన్ అక్టోబర్ 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు రైట్స్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kantara Movie: బాక్సాఫీస్ వద్ద నయా రికార్డ్ సృష్టించిన కాంతార మూవీ.. ఏకంగా కేజీఎఫ్ 2 చిత్రాన్ని వెనక్కు నెట్టిన రిషబ్ శెట్టి..
Kantara Movie
Rajitha Chanti
|

Updated on: Oct 14, 2022 | 8:17 AM

Share

కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు పొందింది హోంబలే ఫిల్మ్స్. ఈ బ్యానర్‏లో తెరకెక్కిన మరోసినిమా కాంతార. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద హిట్‏గా నిలిచింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ సినిమాను అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా మరో నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. యాక్షన్… థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా.. విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఇక అక్టోబర్ 14న హిందీలో విడుదల కానున్న ఈ మూవీ ఐఎండీబీ రేటింగ్ 9.6 సాధించి రికార్డుకెక్కింది. అంతేకాదు.. రాకింగ్ స్టార్ యశ్ నటించి కేజీఎఫ్.. ఆరఆర్ఆర్ చిత్రాలను వెనక్కు నెట్టి మరీ నెంబర్ వన్ గా నిలిచింది. కేజీఎఫ్ చిత్రానికి (8.4)కాగా.. ఆర్ఆర్ఆర్ సినిమాకు (8) రేటింగ్ ఉన్నాయి.

కాంతారా అనేది కంబ్లా, బూటా కోలా సంప్రదాయ సంస్కృతిని అన్వేషించే పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో రిషబ్ శెట్టి రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలకపాత్రలలో నటించారు. ఇప్పటివరకు కర్ణాటకలో దాదాపు రూ. 58 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా మలయాళంలో అక్టోబర్ 21న విడుదల కానుంది.

అలాగే ఈ మూవీ తెలుగు వెర్షన్ అక్టోబర్ 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు రైట్స్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.

తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో