AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AA19 Title: ‘అల వైకుంఠపురంలో’ టైటిల్ వెనుక కథ

బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ టైటిల్ మొత్తానికి వచ్చేసింది. తనకు కలిసొచ్చిన అ సెంటిమెంట్‌తోనే అల వైకుంఠపురం అనే టైటిల్‌ను బన్నీకి ఫిక్స్ చేశాడు త్రివిక్రమ్. కాగా ఈ టైటిల్ వెనుక పురాణాల్లో పెద్ద కథనే ఉంది. ఇక ఇప్పుడు తాను తెరకెక్కించే సినిమా నేపథ్యానికి ఈ టైటిల్‌ సరిపోతుందని భావించే ఆయన ఇలా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక అసలు విషయంలోకి వస్తే.. పోతన రాసిన భాగవతంలోని గజేంద్ర మోక్షంలోనిది అల వైకుంఠ […]

AA19 Title: ‘అల వైకుంఠపురంలో’ టైటిల్ వెనుక కథ
Ala Vaikunthapuramulo First Look
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 15, 2019 | 12:20 PM

Share

బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ టైటిల్ మొత్తానికి వచ్చేసింది. తనకు కలిసొచ్చిన అ సెంటిమెంట్‌తోనే అల వైకుంఠపురం అనే టైటిల్‌ను బన్నీకి ఫిక్స్ చేశాడు త్రివిక్రమ్. కాగా ఈ టైటిల్ వెనుక పురాణాల్లో పెద్ద కథనే ఉంది. ఇక ఇప్పుడు తాను తెరకెక్కించే సినిమా నేపథ్యానికి ఈ టైటిల్‌ సరిపోతుందని భావించే ఆయన ఇలా ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఇక అసలు విషయంలోకి వస్తే.. పోతన రాసిన భాగవతంలోని గజేంద్ర మోక్షంలోనిది అల వైకుంఠ పురంబులో అనే పద్య పదం. అందులో నీళ్లలోకి దిగిన గజరాజును అక్కడున్న మొసలి కాలు పట్టుకోవడంతో.. దాని నుంచి విడిపించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించిన ఏనుగు.. చివరకు నారాయణుడికి మొర పెట్టుకుంటుంది. ఇక ఏనుగు మొరను ఆలకించిన మహా విష్ణువు భూమిని చేరుకొని తన సుదర్శన చక్రంతో మొసలి తలను ఖండించి ఆ ఏనుగుకు విముక్తిని కలిగిస్తాడు. ఇక ఇప్పుడు బన్నీ మూవీ కూడా ఇలాంటి కథా నేపథ్యంతోనే నడుస్తుందని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో టబు కోసం ఓ బంగ్లా సెట్‌ను వేశారని.. ఇక ఆ ఇంటి పేరు వైకుంఠ పురం అని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించగా.. టబు, నివేథా పేతురాజ్, జయరామ్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, నవదీప్, రావు రమేష్, సునీల్, సుశాంత్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.