కేజ్రీ రక్షాబంధన్ గిఫ్ట్.. మహిళలకిక ‘ఫ్రీ’ బస్ ట్రావెల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఢిల్లీలో ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చని ఆయన వెల్లడించారు. అక్టోబర్ 29 నుంచి ఇది అమల్లోకి రానుందని కేజ్రీవాల్ ప్రకటించారు. కాగా రెండు నెలల క్రితం ఢిల్లీ మెట్రోల్లోనూ, ప్రభుత్వ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తామని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అక్టోబర్ 29 నుంచి ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. ‘‘రక్షా బంధన్ […]

కేజ్రీ రక్షాబంధన్ గిఫ్ట్.. మహిళలకిక ‘ఫ్రీ’ బస్ ట్రావెల్
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2019 | 2:57 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఢిల్లీలో ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చని ఆయన వెల్లడించారు. అక్టోబర్ 29 నుంచి ఇది అమల్లోకి రానుందని కేజ్రీవాల్ ప్రకటించారు. కాగా రెండు నెలల క్రితం ఢిల్లీ మెట్రోల్లోనూ, ప్రభుత్వ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తామని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అక్టోబర్ 29 నుంచి ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు.

‘‘రక్షా బంధన్ శుభ సందర్భంగా నా సోదరీమణులకు బహుమతిని ఇవ్వాలనుకుంటున్నా. అక్టోబర్ 29 నుంచి ఢిల్లీ ప్రభుత్వ బస్సుల్లోనూ, క్లస్టర్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. దీని ద్వారా వారికి రక్షణ కల్పించవచ్చు’’ అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.